Heavy Rains | ఉత్తరాది రాష్ట్రాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. హిమాచల్‌కు రెడ్ అలర్ట్

Follow

Heavy Rains | ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. ఈ వర్షాలకు పలుచోట్ల వరదలు సంభవిస్తున్నాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి.
తాజాగా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని 10 జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) వరద హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది. బిలాస్‌పూర్, సోలన్, సిమ్లా, సిర్మౌర్, హమీర్‌పూర్, మండి, కాంగ్రా జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ‘కులు, ఉనా, చంబా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని తెలిపింది. రాబోయే 3 నుండి 4 గంటల్లో కిన్నౌర్, లాహుల్, స్పితి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు గత 24 గంటల్లో రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిశాయని, కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైందని ఐఎండీ సిమ్లా కేంద్రంలోని సీనియర్ అధికారి సందీప్ కుమార్ శర్మ తెలిపారు.
ఇక భారీ వర్షాల కారణంగా అనేకచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా దాదాపు 129 రహదారులను మూసివేశారు. మండి, సిర్మౌర్ జిల్లాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సోలన్‌లో ఓ వంతెన కొట్టుకుపోయింది. రెడ్ అలర్ట్ నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలకు అధికారులు నేడు సెలవు ప్రకటించారు. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నుంచి రాష్ట్రంలో 20 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షం కారణంగా బియాస్ నది (Beas River)కి వరద తీవ్రత పెరిగింది. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read..
Sanjay Raut | అబద్దాలు చెప్పడం బీజేపీ జాతీయ విధానం : సంజయ్ రౌత్
Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం.. స్థానిక రాజకీయ నేత అరెస్ట్
Heavy Rains | ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.