Hero Sriram : అవును.. నేను డ్రగ్స్ తీసుకున్నాను.. బెయిల్ ఇవ్వండి

Follow

రోజాపూలు, ఒకరికి ఒకరు వంటి హిట్ సినిమాలో నటించి మెప్పించిన నటుడు శ్రీరామ్ ను డ్రగ్స్ కేసులో చెన్నై పోలీసులు అరెస్ట్ చేసారు. తమిళనాడుకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి నుండి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అతడిని అరెస్ట్ చేసి నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Also Read : Vijay Varma : దంగల్ భామతో తమన్నా మాజీ లవర్ ప్రేమరసం
అనంతరం చెన్నైలోని ఎగ్మోర్ కోర్టులో న్యాయవాదులు ఎదుట హాజరుపరచగా డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన శ్రీరాంకు జులై 7వ తేది వరకు రిమాండ్ విధించింది ధర్మాసనం. అలాగే శ్రీరామ్ ను కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసారు నుంగంబాకం పోలీసులు. మరోవైపు నటుడు శ్రీరామ్ కూడా డ్రగ్స్ కేసులో బెయిల్ కోసం ఎగ్మోర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. నేను చాలా పెద్ద తప్పు చేసాను. అయితే తాను డ్రగ్స్ ఎవరికి అమ్మలేదు అలాగే వాడమని ఎవరిని ప్రేరేపించలేదు, తాను మాత్రమే తీసుకున్నాను అని పేర్కొన్నాడు శ్రీరామ్. నేను ఏ విదేశాలకు పారిపోను. సాక్షులను కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నించను. పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తాను. ఎప్పుడు పిలిచిన విచారణకు వస్తాను. నా బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడు. వాడిని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ టైమ్ లో నేను నా ఫ్యామిలోకి అండగా ఉండాలి. కాబట్టి ఈ కేసులో నాకు బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తిని కోరాడు శ్రీరామ్. ఇటు పోలీసులు అటు శ్రీరామ్ ఇద్దరు వేసిన పిటిషన్ న్యాయస్థానం ఎటువంటి తీర్పునిస్తుందో చూడాలి.
రోజాపూలు, ఒకరికి ఒకరు వంటి హిట్ సినిమాలో నటించి మెప్పించిన నటుడు శ్రీరామ్ ను డ్రగ్స్ కేసులో చెన్నై పోలీసులు అరెస్ట్ చేసారు. తమిళనాడుకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి నుండి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అతడిని అరెస్ట్ చేసి నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. Also Read : Vijay Varma : దంగల్ భామతో తమన్నా మాజీ లవర్ ప్రేమరసం అనంతరం చెన్నైలోని ఎగ్మోర్ కోర్టులో న్యాయవాదులు ఎదుట హాజరుపరచగా డ్రగ్స్