HONOR Magic V5 : మడతబెట్టే ఫోన్ కావాలా? హానర్ వరల్డ్ స్లిమ్మెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోందోచ్.. ట్రిపుల్ కెమెరా సెటప్ ఫీచర్లు కేక!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
HONOR Magic V5

HONOR Magic V5 : కొత్త హానర్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది. మ్యాజిక్ V5 పేరుతో జూలై 2న చైనాలో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, స్లిమ్, తేలికైన ఫారమ్ ఫ్యాక్టర్‌ను కలిగి ఉంది. ఈ మోడల్ ప్రీమియం ఫీచర్లు, అల్ట్రా-థిన్ బాడీతో వస్తుంది.

OISతో 64MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కలిగి ఉంది. హై రిజల్యూషన్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కలిగి ఉంది. 50MP పెరిస్కోప్ లెన్స్‌తో మ్యాజిక్ V3 కన్నా అప్‌గ్రేడ్ అప్షన్లను కలిగి ఉంది. కొత్త సెన్సార్ క్లియర్ జూమ్ ఫొటోలు, ఫొటోగ్రాఫర్‌లకు స్టేబిలిటీని అందిస్తుంది.

ట్రిపుల్ కెమెరా సెటప్ :
హానర్ మ్యాజిక్ V5లో పెరిస్కోప్ షూటర్‌తో పాటు, 50MP మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ స్నాపర్ ఉండవచ్చని అంచనా. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ కేవలం ఫోల్డబుల్ టెక్నాలజీ కలిగి ఉంది. హానర్ మ్యాజిక్ V5 ఫోల్డబుల్ సెగ్మెంట్‌లో కెమెరా ఫోన్‌లతో వస్తుంది. షాక్-అబ్జార్బెంట్ లుబన్ హింజ్ కూడా ఉంది. ఫోల్డబుల్ ఫోన్ లోపలి స్క్రీన్‌లో ఏఐ-ఆధారిత ఫీచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి.

Read Also : iPhone 16 Pro Max : భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్రో.. అతి తక్కువ ధరకే ఈ డీల్ ఎలా పొందాలంటే?

బ్యాటరీ, పర్ఫార్మెన్స్ (అంచనా) :
ఈ హానర్ ఫోన్ 6,100mAh బ్యాటరీతో వస్తుంది. రెండు స్క్రీన్లు ఉన్నప్పటికీ ఎక్స్‌టెండెడ్ రన్‌టైమ్‌ను అందిస్తుంది. 66W వైర్డు కాన్ఫిగరేషన్ ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్ అందిస్తుంది. హానర్ మ్యాజిక్ V5 స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను కలిగి ఉండాలి. టాప్-ఎండ్ పర్ఫార్మెన్స్, మల్టీ టాస్కింగ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

డిజైన్, వేరియంట్లు, డిస్‌ప్లే :
హానర్ మ్యాజిక్ V5 ఫోన్ మోడల్ డాన్ గోల్డ్, సిల్క్ రోడ్ డన్హువాంగ్, వెల్వెట్ బ్లాక్, వార్మ్ వైట్ అనే 4 కలర్ ఆప్షన్లలో ఉండొచ్చునని హానర్ ధృవీకరించింది. ఈ ఫోన్‌లో 12GB + 256GB, 16GB + 512GB, 16GB + 1TB అత్యధిక వేరియంట్ వంటి వివిధ రకాల ర్యామ్, స్టోరేజీ ఆప్షన్లు ఉంటాయి. ఈ ఫోన్ కేవలం 8.8mm మందంతో ఫోల్డ్ చేయొచ్చు. 217 గ్రాముల బరువు ఉంటుందని అంచనా. ప్రపంచంలోనే అత్యంత సన్నని, తేలికైన ఫోల్డబుల్‌గా చెప్పవచ్చు.

​HONOR Magic V5 : హానర్ జూలై 2న చైనాలో మ్యాజిక్ V5ను ఆవిష్కరించనుంది. OISతో కూడిన 64MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కంపెనీ రివీల్ చేసింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *