Houthi Rebels: అమెరికాకు హౌతీ రెబల్స్ వార్నింగ్.. ఇజ్రాయెల్‌కు సహకరిస్తే మీ నౌకలపై దాడి చేస్తాం

Follow

Houthi Rebels: ఇజ్రాయెల్- ఇరాన్ దేశాల మధ్య యుద్ధం తొమ్మిదవ రోజుకు చేరుకుంది. ఈ యుద్ధం ముగిసే సంకేతాలు కూడా కనిపించకపోవడం లేదు. అయితే, ఇటీవల ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చి వివాదంలోకి దిగాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి రెండు వారాల సమయం తీసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నాడు. దీంతో రంగంలోకి హౌతీ రెబల్స్ అగ్ర రాజ్యం అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తే.. భవిష్యత్ లో తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. అలాగే, ఎర్ర సముద్రంలో యూఎస్ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని హెచ్చరించింది. మరోవైపు, 2024 మే నెలలో అమెరికా- హౌతీ రెబల్స్ మధ్య కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంట్లో ఒకరిపై మరోకరు లక్ష్యంగా దాడులు చేసుకోవద్దని పేర్కొన్నాయి.
Read Also: YS Jagan: వైఎస్ జగన్‌పై కుట్రలు జరుతున్నాయా..?
అయితే, శుక్రవారం నాడు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన ఖుద్స్ ఫోర్స్ ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ బెహ్నామ్ షాహ్‌రియారీ చనిపోయినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఇరాన్ నుంచి హమాస్, హెజ్‌బొల్లా, హూతీ తదితర సంస్థలకు ఆయుధాల సరఫరాలో షాహ్‌రియారీ కీలక పాత్ర పోషించినట్లు తెలిపింది. అలాగే, తమ ఫైటర్ జెట్‌లు చేసిన దాడుల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వైమానిక దళం, డ్రోన్ యూనిట్ కమాండర్ సయీద్ ఇజాది సహా పలువురు నేతలు చనిపోయినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఇవాళ (జూన్ 21న) ధ్రువీకరించారు.
హౌతీ రెబల్స్ అగ్ర రాజ్యం అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తే.. భవిష్యత్ లో తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. అలాగే, ఎర్ర సముద్రంలో యూఎస్ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని హెచ్చరించింది.