Hyderabad: అరేయ్.. ఏంట్రా ఇది.. గోడకు కన్నం వేసి దర్జాగా లోపలికి వెళ్లాడు.. కట్ చేస్తే..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Hyderabad: అరేయ్.. ఏంట్రా ఇది.. గోడకు కన్నం వేసి దర్జాగా లోపలికి వెళ్లాడు.. కట్ చేస్తే..

ఇంట్లో లేదా దుకాణంలోకి దొంగలు చొరబడటం లేదా దొంగతనం చేయడం గురించి మనం నిత్యం చూస్తూనే ఉంటాం.. వింటుంటాం.. కానీ, ఇక్కడ మాత్రం ఓ మాస్టర్ ప్లానే వేశాడు దుండగుడు.. ఇలాంటి దోపిడీ ఘటన మరెక్కడా చూసుండరు. ఎందుకంటే.. ఓ ఆగంతకుడు మంచిగా ప్లాన్ వేసి.. గోడకు కన్నం వేసి విలువైన మొబైల్ ఫోన్‌లను దొంగిలించాడు. ఈ దొంగతనానికి సంబంధించిన షాకింగ్ ఘటన హైదరాబాద్‌ నగరంలోని దిల్‌సుఖ్ నగర్‌లో వెలుగు చూసింది. ఆదివారం రాత్రి ఒక వ్యక్తి బిగ్ సి షోరూంలోకి చొరబడి రూ.5 లక్షల విలువైన అనేక మొబైల్ ఫోన్లను దొంగిలించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గోడకు కన్నం వేసిన దుండగుడు.. దర్జాగా షోరూం లోపలకు వెళ్లి.. విలువైన ఫోన్లను ఎత్తుకెళ్లాడు..

దుండగుడు.. ప్రధాన ద్వారం గుండా దుకాణంలోకి చొరబడకుండా, దొంగ తనకోసం ఒక ప్రత్యేక ప్రవేశ ద్వారం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను బిగ్ సి షోరూమ్‌లోకి ప్రవేశించగలిగేంత పెద్దదిగా పక్క గోడకు రంధ్రం చేశాడు. గోడను పగలగొట్టడానికి ఉపయోగించిన సుత్తితో పాటు శిథిలాలు దుకాణం ప్రక్కనే ఉన్న మెట్లపై పడి ఉన్నాయి.. మరో సీసీటీవీ ఫుటేజీలో, దొంగ ముఖం, తల కనపడకుండా.. ఉండేందుకు ఓ వస్త్రాన్ని కప్పుకున్నాడు.. ఆ తర్వాత దుకాణంలో తనకు ఇష్టమైన ఫోన్లను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు..

వీడియో చూడండి..

మొదటగా షెల్ఫ్ వైపు నడిచి.. మూడు ఫోన్లు తీసుకున్నాడు.. ఆ తరువాత మరొక రాక్‌కి వెళ్లి మరికొన్ని మొబైల్ ఫోన్‌లను తీసుకున్నాడు.. అతను దుకాణం నుండి బయటకు వచ్చేముందు వివిధ బ్రాండ్‌లకు చెందిన కనీసం ఆరు మొబైల్ ఫోన్‌లను దొంగిలించాడు.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

​ఇంట్లో లేదా దుకాణంలోకి దొంగలు చొరబడటం లేదా దొంగతనం చేయడం గురించి మనం నిత్యం చూస్తూనే ఉంటాం.. వింటుంటాం.. కానీ, ఇక్కడ మాత్రం ఓ మాస్టర్ ప్లానే వేశాడు దుండగుడు.. ఇలాంటి దోపిడీ ఘటన మరెక్కడా చూసుండరు. ఎందుకంటే.. ఓ ఆగంతకుడు మంచిగా ప్లాన్ వేసి.. గోడకు కన్నం వేసి విలువైన మొబైల్ ఫోన్‌లను దొంగిలించాడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *