Hyderabad | కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అదృశ్యం

Follow

కాచిగూడ, జూలై 1: మతిస్థిమితం లేని మహిళ అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ తల్లోజు జోత్స్న, ఎస్ఐ డి.సుభాష్ వివరాల ప్రకారం.. గోల్నాక చర్చిలైన్‌లోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన గోపాలదాసు భార్య ప్రభావతి(55)గత కొంతకాలంగా ఈమెకు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఆదివారం కూతురు డ్యూటీకి వెళ్లింది. అనంతరం ప్రభావతి ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి ఇప్పటివరకు తిరిగి రాలేదు.
కుటుంబ సభ్యులు, కూతురు ఇరుగు, పొరుగు, ఇతర ప్రాంతాల్లో వెతికిన ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం కూతురు ఝాన్సీరాణి కాచిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుభాష్ తెలిపారు. అదృశ్యమైన మహిళ వంటిపై నీలి రంగు చీర, పసుపు రంగు జాకెట్ ధరించి, ఎత్తు 5.5 ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహిళ వివరాల కోసం 8712660542 లో సంప్రదించాలని కోరారు.
మతిస్థిమితం లేని మహిళ అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.