Hyderabad | హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యం

Follow

Hyderabad | మియాపూర్, జూన్ 29 : ఆర్థిక సమస్యలతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యమైన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. మియాపూర్ ఎస్సై కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం… మియాపూర్ మాతృశ్రీ నగర్‌లో నివసించే దేవకుమార్(40) ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. గర్భిణి అయిన భార్య ప్రసవం నిమిత్తం ఇంటికి వెళ్ళింది. అయితే ఆర్థిక సమస్యల కారణంగా దేవకుమార్ ఆదివారం ఉదయం తన సహచర ఉద్యోగులు కొందరికి వాట్సాప్ ద్వారా సందేశాలను పంపాడు. తదుపరి తాను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నట్లు పేర్కొన్నాడు. తోటి ఉద్యోగులు దేవ్ కుమార్ ఆచూకీ కోసం వెతికినప్పటికీ ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో దేవకుమార్ ఆచూకీపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Hyderabad | ఆర్థిక సమస్యలతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అదృశ్యమైన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.