IBPS Notification 2025: ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల.. 5,208 ఉద్యోగాల భర్తీ.. పూర్తి వివరాలు మీకోసం

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
IBPS Notification 2025 Released

గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అలాంటి వారికి ఐబీపీఎస్‌ శుభవార్త చెప్పింది. దేశంలోని పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,208 ప్రొబెషనరీ ఆఫీసర్లు / మేనేజ్మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.ibps.in ద్వారా అప్లై చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

విద్యార్హత: పీవో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పూర్తి చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు తేదీలు: జులై 1 నుంచి జులై 21 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

వయోపరిమితి: దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఓబిసి వర్గానికి 3, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

దరకాస్తు రుసుము: జనరల్, ఓబీసీ కేటగిరీ దరఖాస్తుదారులు రూ. 850, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులకు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది.

ఐబీపీఎస్‌ పీవో పోస్టులకు దరఖాస్తుదారులకు ప్రాథమిక పరీక్షను ఆగస్టు 2025లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ మోడ్‌లో నిర్వహిస్తారు. ఫలితాలను సెప్టెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 2025లో ఉండే అవకాశం ఉంది.

దరఖాస్తు ఇలా చేసుకోండి:

  • IBPS అధికారిక వెబ్‌సైట్ ibps.in లోకి వెళ్ళాలి.
  • హోమ్ పేజీలో PO అప్లై లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మీ వివరాలను నమోదు చేయాలి
  • అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • ఫీజు చెల్లించి సబ్మిట్ చేయండి.

​IBPS Notification 2025: దేశంలోని పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,208 ప్రొబెషనరీ ఆఫీసర్లు / మేనేజ్మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *