IND vs ENG : ‘అయితే ఏంటి..’ నాలుగు క్యాచ్‌లు వదిలేసిన జైస్వాల్‌పై గంభీర్ కీలక కామెంట్స్.. మీరు ఆశ్చర్యపోవడం ఖాయం..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Gautam Gambhir

Yashasvi Jaiswal – Gautam Gambhir: ఇంగ్లాడ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ జట్టు పరాజయం పాలైంది. ఈ టెస్టు మ్యాచ్ లో భారత బ్యాటర్లు ఐదు సెంచరీలు చేసినప్పటికీ టీమిండియా ఓటమి పాలైంది. ఇందుకు ప్రధాన కారణం.. భారత ఆటగాళ్ల చెత్త ఫీల్డింగ్. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి భారత ప్లేయర్లు ఏడు కీలకమైన క్యాచ్‌లు వదిలివేయడంపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ENG vs IND: అప్పట్లో ఆస్ట్రేలియా.. ఇప్పుడు టీమిండియా.. టెస్టుల్లో చెత్తరికార్డు నమోదు..

ముఖ్యంగా యశస్వీ జైస్వాల్ ఆటతీరుపై సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అతను రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కీలకమైన నాలుగు క్యాచ్ లు డ్రాప్ చేశాడు. ముఖ్యంగా.. ఇంగ్లాండ్ విజయానికి 371 పరుగులు అవసరం. ఐదోరోజు ఆటలో ఆ జట్టు తేలిగ్గా లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లాండ్ విజయంలో డకెట్ కీలక భూమిక పోషించాడు. అతను 149 పరుగులు చేశాడు. అయితే, డకెట్ వ్యక్తిగత స్కోరు 97 పరుగుల వద్ద మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో ఔట్ అయ్యే అవకాశం లభించింది. కానీ, జైస్వాల్ ఆ క్యాచ్ ను డ్రాప్ చేశాడు.

Also Read: భారత్ కొంపముంచిన యశస్వీ జైస్వాల్.. గెలిచే మ్యాచ్‌ను ఓడగొట్టావ్ కద బ్రో..! సిరాజ్ ఆగ్రహం.. గంభీర్ అయితే.. వీడియో వైరల్

భారత ఫీల్డర్లు, ముఖ్యంగా జైస్వాల్ పై సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్న వేళ.. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం జైస్వాల్ కు మద్దతుగా నిలిచాడు. ‘‘క్యాచ్‌లు మిస్ అవుతుంటాయి. అత్యుత్తమ ఫీల్డర్లు కూడా ఒక్కోసారి ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు. వారిలో ఎవరూ ఉద్దేశపూర్వకంగా క్యాచ్ లు మిస్ చేయాలని అనుకోరు.’ అంటూ మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో గంభీర్ జైస్వాల్‌కు మద్దతుగా మాట్లాడాడు. అయితే, ఈ మ్యాచ్ లో భారత జట్టు ఓటమికి లోయర్ ఆర్డర్ పేలవమైన ప్రదర్శనలే కారణమని గంభీర్ చెప్పుకొచ్చాడు.

అయితే, ఈ మ్యాచ్ లో భారత జట్టు ఓటమికి లోయర్ ఆర్డర్ పేలవమైన ప్రదర్శనలే కారణమని గంభీర్ చెప్పుకొచ్చాడు. “బ్యాటింగ్ నిరాశపరిచింది. ఎందుకంటే మేము మొదటి ఇన్నింగ్స్‌లో 40 పరుగులకు ఏడు వికెట్లు, రెండవ ఇన్నింగ్స్‌లో 30 పరుగులకు 6 వికెట్లు కోల్పోయాము. మొదటి ఇన్నింగ్స్‌లో మాకు దాదాపు 600 పరుగులు చేసే అవకాశం ఉంది. కానీ, లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో లేదు. రెండవ టెస్ట్ మ్యాచ్‌లో అన్ని తప్పులను సరిదిద్దుకొని బరిలోకి దిగుతామని ఆశిస్తున్నా’’. అని గంభీర్ అన్నారు.

 

​ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ప్లేయర్లు ఏడు కీలకమైన క్యాచ్‌లు వదిలివేయడంపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *