India Canada: ఉప్పు నిప్పు కలిశాయి.. మారిపోయిన కెనడా వైఖరి.. భారత్‌తో మెరుగుపడిన సంబంధాలు..

Follow

India Canada: రాజకీయాల్లో మిత్రులు, శత్రువులు శాశ్వతంగా ఉండిపోరు అంటారు. అలానే దేశాల మధ్య వైరం కూడా. 3 నెలల క్రితం వరకు భారత్ కి శత్రు దేశంలా వ్యవహరించిన కెనడా.. ఇప్పుడు తన తీరు పూర్తిగా మార్చేసుకుంది. భారత్ పై తమ దేశం వేదికగా కుట్రలకు చెక్ చెప్పే పనిలో పడింది. దానికి కారణం అక్కడి ప్రభుత్వం మారడమే. దాంతోపాటు జీ7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల క్రితం చేసిన ప్రసంగం కూడా దోహదపడింది. ఒకానొక దశలో పాకిస్తాన్ కంటే కెనడానే మనకి శత్రు దేశంలా వ్యవహరించిన తీరు కాస్త ఇప్పుడు అందరికంటే కెనడానే మనకి నమ్మదగిన దేశంలా మారిందనే స్థాయికి సంబంధాలు మెరుగుపడ్డాయి.
రెండేళ్లుగా ఇండియాతో ఘర్షణాత్మక వైఖరి తీసుకున్న కెనడా… ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తన తీరు కూడా మార్చుకుంది. ట్రూడో ఉన్నప్పుడు జరిగిన పరిణామాలను పక్క పెట్టి భారత్ తో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. దీనికి జీ7 సదస్సు వేదికగా మారింది. ఇదే సమయంలో అమెరికా రావాలని మోదీకి ట్రంప్ పిలుపు ఇచ్చినా.. మోదీ దాన్ని కేర్ చేయలేదు. మరోసారి కలుద్దాం అంటూ లైట్ తీసుకున్నారు. దానికి.. పాకిస్తాన్ కు ట్రంప్ ఇస్తున్న ప్రాముఖ్యతే కారణం.
ఇదే జీ7 సదస్సులో కెనడా ప్రధాని కార్నీతో మోదీ కీలక చర్చలు జరిపారు. గత ప్రధాని జస్టిన్ ట్రూడో వైఖరి కారణంగా ఉభయ దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాల పునరుద్దరణకు నిర్ణయిచారు. కాన్సులర్, వాణిజ్య సేవలను సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు రెండు దేశాల రాయబార కార్యాలయాల్లో కొత్త హైకమిషనర్లను నియమించబోతున్నారు. అలాన జనరల్ సిటిజన్స్, పారిశ్రామికవేత్తలు ఉభయ దేశాల్లో తమ నిత్య కార్యకలాపాలను తిరిగి కొనసాగించేందుకు ఈ నిర్ణయం దోహద పడనుంది.
రెండేళ్ల క్రితం ప్రధానిగా ఉన్న ట్రూడో కెనడాలో సిక్కు వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని ఆరోపించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య గ్యాప్ పెరిగింది. చివరకు రాయబారులను బహిష్కరించుకునేంత వరకు వెళ్లింది. అయితే మార్క్ కార్నీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ గ్యాప్ తగ్గడం ప్రారంభమైంది.
ఇదే సమయంలో అమెరికా రావాలని మోదీకి ట్రంప్ పిలుపు ఇచ్చినా.. మోదీ దాన్ని కేర్ చేయలేదు.