India Record: 93 ఏళ్ల చరిత్రను తిరగరాసిన టీమిండియా.. ఎలా అంటే..?

Follow

India Record: లీడ్స్ లో భారత్, ఇంగ్లాడ్ మధ్య జరుగుతున్న టెస్ట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ తో టీమిండియా ఓ అరుదైన ఘనతను నమోదు చేసింది. 93 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భారత జట్టు బ్యాట్స్మెన్స్ ఏకంగా ఐదు శతకాలతో రెచ్చిపోయారు. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం ఆరుసార్లే జరిగే అరుదైన ఘటన కాగా, విదేశీ గడ్డపై ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా భారత్ నిలిచింది.
Read Also:AP Cabinet Sub Committee: నేడు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై చర్చ!
లీడ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (101), శుభ్‌మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) లు వారి అద్భుత శతకాలతో భారత్ 471 పరుగుల భారీ స్కోరు సాధించగా.. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ కౌంటర్ అటాక్‌కు దిగింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో టీమిండియాకు కేవలం 6 పరుగుల లీడ్ మాత్రమే లభించింది. మొదటి ఇన్నింగ్స్ భర్త బౌలింగ్ లో బుమ్రా (5/83), ప్రసిద్ధ్ కృష్ణ (3/128) మంచి ప్రదర్శన కనపరిచారు. మరోవైపు ఈ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ తరపున ఓల్లీ పోప్ (106), బెన్ డకెట్ (62), హ్యారీ బ్రూక్ (99), జేమీ స్మిత్ (40), క్రిస్ వోక్స్ (38) లు ఇంగ్లండ్ భారీ స్కోర్ కు తోడ్పడు అందించారు.
Read Also:Iran-Israel: ట్రంప్ ప్రకటనను తోసిపుచ్చిన ఇరాన్.. ఎలాంటి ఒప్పందం జరగలేదని వెల్లడి
ఇక భారత్ రెండో ఇన్నింగ్స్‌లో KL రాహుల్ (137), రిషబ్ పంత్ (118) మరోసారి రాణించగా.. పంత్ ద్విశతకాలతో టెస్ట్ క్రికెట్‌లో ఒకే టెస్ట్ లో రెండుసార్లు శతకాలు నమోదు చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా చరిత్రలో నిలిచాడు. ఇక శనివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో వికెట్ ఏమి కొల్పకుండా 21 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ చివరి రోజున ఇంగ్లాండ్ గెలవాలంటే 350 పరుగులు చేయాల్సి ఉండగా, టీమిండియా విజయానికి 10 వికెట్లు నేలకూల్చాలి.
India Record: లీడ్స్ లో భారత్, ఇంగ్లాడ్ మధ్య జరుగుతున్న టెస్ట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ తో టీమిండియా ఓ అరుదైన ఘనతను నమోదు చేసింది. 93 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భారత జట్టు బ్యాట్స్మెన్స్ ఏకంగా ఐదు శతకాలతో రెచ్చిపోయారు. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం ఆరుసార్లే జరిగే అరుదైన ఘటన కాగా, విదేశీ గడ్డపై ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. Read Also:AP Cabinet