Interval Walking Benefits: మెదడు నుండి గుండె వరకు అన్నీ సెట్.. ఇంటర్వెల్ వాకింగ్ తో అద్భుతం.. మీరు కూడా ట్రై చేయండి

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Benefits of Interval walking

ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. యోగ, వ్యాయామం, జిమ్ వంటివి అలవాటు చేసుకుంటున్నారు. అలాంటివారిలో నడక ముఖ్యమైనది. ఉదయం పూట నడక అనేది ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనాలను అందిస్తుంది. అయితే ఈ నడకలో కూడా చాలా రకాలు ఉన్నాయి. వాటిలో జాపనీస్ నడక అని, వెనుక నడక అని. ఇప్పుడు వీటిలో మరో కొత్త నడక చేరింది. అదే ఇంటర్వెల్ నడక. ఈ ఇంటర్వెల్ నడకతో చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. మరి ఇంటర్వెల్ నడక అంటే ఏంటి? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటర్వెల్ వాకింగ్ అంటే ఏమిటి?

ఇంటర్వెల్ వాకింగ్ అనేది ఒక వ్యాయామ పద్ధతి. ఇందులో కొన్ని నిమిషాలు మోస్తరు వేగంతో నడవాలి. దానిని అనుసరిస్తూ కొన్ని నిమిషాలు వేగంగా నడవాలి. ఇది ఈ రెండు వేగాల మిళితంగా కొనసాగుతుంది. స్లో వాక్, ఫాస్ట్ వాక్ ఈ రెండిటిని కలిపి ఒక ఇంటర్వెల్ అంటారు. అలా మళ్ళీ మళ్ళీ చేయడాన్నే “ఇంటర్వెల్ వాకింగ్” అంటారు.

ఇంటర్వెల్ వాకింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

1. హృదయ ఆరోగ్యం మెరుగవుతుంది:
వేగంగా నడిచే దశలో గుండె వేగంగా పనిచేస్తుంది, నెమ్మదిగా నడిచే దశలో విశ్రాంతి ఇస్తుంది. దీనివల్ల గుండెకు ఒక “ప్రాక్టికల్ ఎక్సర్సైజ్” లభిస్తుంది. మానవ హృదయం క్రమంగా బలపడుతుంది.

2. బరువు తగ్గటానికి సహాయపడుతుంది:
ఇంటర్వెల్ వాకింగ్‌ వల్ల శరీరం ఎక్కువ క్యాలొరీలు ఖర్చు చేస్తుంది. మెటాబాలిజం వేగంగా జరిగేలా చేస్తుంది. ఇది బరువు తగ్గటానికి సహకారం.

3. బీపీ మరియు షుగర్ నియంత్రణ:
ఇంటర్వెల్ వాకింగ్ వలన రక్తనాళాలు శ్రమను అధిగమించి బలపడతాయి. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలోకి వస్తాయి.

4. గుండె పోటు ప్రమాదం తగ్గుతుంది:
వారానికి కనీసం 5 సార్లు 30 నిమిషాల ఇంటర్వెల్ వాకింగ్ చేసినవారిలో హార్ట్ అటాక్ రిస్క్ 30% వరకు తగ్గిందని నిపుణులు చెప్తున్నారు. ఇది శాస్త్రీయంగా బలపర్చబడింది కూడా.

5. నాడీ వ్యవస్థ, మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది:
మారుతున్న జీవనశైలిలో మెదడు పనితీరు దెబ్బతింటోంది. అయితే, ఇంటర్వెల్ వాకింగ్ వలన ఆక్సిజన్ సరఫరా మెరుగ్గా జరుగుతుంది. మానసిక స్పష్టత పెరుగుతుంది.

ఇంటర్వెల్ వేకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఒకేసారి ఎక్కువగా కాకుండా ప్రారంభంలో మితంగా చేయాలి. రోజుకు 15 నుంచి 20 నిమిషాల నుంచే మొదలుపెట్టాలి. ఆ తర్వాత మెల్లిగా 30 నుంచి 40 నిమిషాలకు పెంచుకుంటూ వెళ్ళాలి. నడకలో మంచి షూస్ ధరించాలి. దానివల్ల వల్ల మోకాళ్లపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. సాక్స్ కూడా తప్పకుండా వాడాలి. డయాబెటిస్ లేదా హార్ట్ ప్రాబ్లెమ్స్ ఉన్నవారు ఫిజిషియన్ గైడెన్స్‌ తీసుకోవడం మంచిది. ప్రతీరోజు క్రమం తప్పకుండా కాకుండా వారం రోజుల్లో కనీసం 1 నుంచి 2 రోజులు విశ్రాంతి ఇవ్వడం మంచిది. ఇంటర్వెల్ వాకింగ్ అనేది తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనాలు ఇచ్చే సరళమైన, సురక్షితమైన వ్యాయామ పద్ధతి. ఇది మాములు నడక కంటే మెరుగైన ఫలితాలను ఇస్తుంది.

​Interval Walking Benefits: ఇంటర్వెల్ వాకింగ్ అనేది ఒక వ్యాయామ పద్ధతి. ఇందులో కొన్ని నిమిషాలు మోస్తరు వేగంతో నడవాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *