iPhone 16 Pro Max : భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్రో.. అతి తక్కువ ధరకే ఈ డీల్ ఎలా పొందాలంటే?

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
iPhone 16 Pro Max

iPhone 16 Pro Max : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం విజయ్ సేల్స్ ఆపిల్ హై-ఎండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ (iPhone 16 Pro Max) ధరపై రూ.13,500 వరకు డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. మీరు పాత ఐఫోన్ నుంచి అప్‌గ్రేడ్ చేస్తున్నా లేదా వేరే బ్రాండ్ నుంచి మారుతున్నా ఈ డీల్ అసలు వదులుకోవద్దు. ఈ డిస్కౌంట్ అలా పొందాలంటే?

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ డీల్ : 
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో రూ.1,44,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ ప్రస్తుతం విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.9వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ధర రూ.1,35,900కి తగ్గింది. HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.4,500 డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : BSNL Flash Sale : BSNL ఫ్లాష్ సేల్ ఆఫర్లు.. ఇలా రీఛార్జ్ చేస్తే.. 400GB హైస్పీడ్ డేటా పొందొచ్చు.. డోంట్ మిస్..!

ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. హుడ్ కింద, ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ 3nm A18 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. జెన్మోజీ, ఇమేజ్ ప్లేగ్రౌండ్, సిరితో చాట్‌జీపీటీ సపోర్ట్ మరిన్నింటితో సహా అన్ని ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది.

ఆప్టిక్స్ పరంగా.. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 48MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రావైడ్ సెన్సార్, 5x ఆప్టికల్ జూమ్‌తో 12MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఇంకా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ టైటానియం డిజైన్, అప్‌గ్రేడ్ సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.

​iPhone 16 Pro Max : ఐఫోన్ 16 ప్రో ధర భారీగా తగ్గింది. విజయ్ సేల్స్ ద్వారా అతి తక్కువ ధరకే ఈ ఐఫోన్ 16 ప్రో సొంతం చేసుకోవచ్చు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *