Iran: ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేయండి.. ఇరానీయులకు రాజవంశీయుడు రెజా పహ్లవి పిలుపు​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Reza Pahlavi Calls On People To Overthrow Khamenei Government In Iran

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేస్తేనే ఇరాన్ సుభిక్షంగా ఉంటుందని ఇరాన్ రాజవంశీయుడు రెజా పహ్లవి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ముగింపు దిశకు చేరుకుందని.. త్వరలో కూలిపోతుందని తెలిపారు. భవిష్యత్ బాగుండాలంటే ఇరానీయులు తిరగబడాలని కోరారు. ఇది తిరగబడే సమయమని.. ఇరాన్‌ క్షేమంగా ఉండాలంటే ఇదే మంచి సమయమని.. త్వరలో మీతో ఉంటానని రెజా పహ్లవి పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Extra Marital Affair: 45 ఏళ్ల వివాహిత.. వాటర్ సప్లయర్ తో ప్రేమాయణం.. భర్తకు తెలియడంతో..

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇరానీయులను ఉద్దేశించి ఇరాన్ షా మొహమ్మద్ రెజా పహ్లవి వంశస్థుడు క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవి కీలక ప్రసంగం చేశారు. ఇరాన్ ప్రజలు అనిశ్చితిని ఎదుర్కొంటున్న సమయంలో ఖమేనీ రహస్య బంకర్‌లో దాక్కున్నాడని.. అలాంటి వ్యక్తి దేశాన్ని ఏం కాపాడతాడని తెలిపారు. దేశం పతనానికి కారణం ఖమేనీనే అని పేర్కొన్నారు. సంవత్సరాలుగా మాతృభూమిని యుద్ధంలో ఆహుతి కాకుండా నిరోధించడానికి ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చారు. ఖమేనీ ప్రభుత్వం కూలిపోతేనే.. ఇరానీయులు క్షేమంగా ఉంటారని కోరారు. ఇరాన్‌ను తిరిగి పొందే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. బందర్ అబ్బాస్ నుంచి బందర్ అంజాలి వరకు, షిరాజ్ నుంచి ఇష్ఫహాన్ వరకు, తబ్రిజ్ నుంచి జహేదాన్ వరకు, మష్హాద్ నుంచి అహ్వాజ్ వరకు మరియు షహర్-ఎ-కోర్డ్ నుంచి కెర్మాన్షా వరకు.. ఇప్పుడు ఖమేనీ పాలనను అంతం చేద్దాం అంటూ వెల్లడించారు. ఇరాన్ ప్రజలకు తాను భరోసా ఇస్తున్నానని.. ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థాపన కోసం సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇరాన్ భవిష్యత్ కోసం.. అభివృద్ధి కోసం ఇదే మంచి తరుణం అని చెప్పారు.

ఇది కూడా చదవండి: ENG vs IND: విరాట్ కోహ్లీ స్థానంలో ఆడేదెవరు?.. విషయం చెప్పేసిన పంత్!

చరిత్ర..
1979 వరకు ఇరాన్‌లో రాజవంశ పరిపాలన ఉండేది. అనంతరం ఇస్లామిక్ విప్లవం వచ్చింది. ఈ ఉద్యమం రగిలినప్పుడు చివరి రాజవంశీయుడు షా మొహమ్మద్ రెజా పహ్లవి పారిపోయాడు. ఇతడు 1980లో ఈజిప్టులో మరణించాడు. ఇతని కుమారుడు రెజా పహ్లవి.. వాస్తవానికి రాజవంశీయుడిగా ఇతడు వారసుడు. ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇతడు యునైటెడ్ స్టేట్స్‌లో నివాసం ఉంటున్నాడు.

తాజాగా ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేసి.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని పిలుపునిస్తున్నాడు. దాదాపు రాజవంశం పోయి 46 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడున్న తరం.. ఆ రాజవంశీయులను గుర్తుపట్టలేరు. ఇలాంటి తరణంలో రెజా పహ్లవి పిలుపునకు ఇరానీయులు ఏ మేరకు స్పందిస్తారన్నది సందేహమే. ఇప్పటికీ అక్కడక్కడ రాజవంశీయులకు అభిమానులు ఉన్నారు. 46 సంవత్సరాల క్రితం పారిపోయిన వ్యక్తులను గుర్తుపెట్టుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. దీనికి కారణం ఏంటంటే.. అప్పటికీ.. ఇప్పటికీ ఇరాన్ చాలా మారిపోయింది. చాలా అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలో రాజవంశీయులను గుర్తుపెట్టుకుంటారో లేదో అనుమానమే.

ఇక ఇస్లామిక్ విప్లవానికి ముందు ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్‌తో మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత టెహ్రాన్.. అమెరికా, ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువుగా మారింది. అయతుల్లా సుప్రీం నాయకుడిగా ఇస్లామిక్ రిపబ్లిక్ స్థాపించారు. అప్పటినుంచి ఆయన పాలనే కొనసాగుతోంది. ఆనాటి నుంచి శత్రుత్వం పెరిగింది.

ఇక ఇరాన్ నుంచి పారిపోయిన షా మొహమ్మద్ రెజా పహ్లవిని తిరిగి రప్పించేందుకు విద్యా్ర్థుల నేతృత్వంలో నిరసనలు జరిగాయి. ఆందోళనకారులు మరియు ఆయతుల్లా నేతృత్వంలోని ప్రభుత్వం దేశానికి తిరిగి తీసుకురావాలని ప్రయత్నించాయి. 1979, నవంబర్‌లో టెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో 52 మందిని పట్టుకుని 444 రోజులు నిర్బంధించారు. దీంతో వాషింగ్టన్‌తో ఇరాన్ సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. స్నేహితుడే అమెరికాకు శత్రువుగా మారింది. ఇక ట్రంప్ మొదటి సారి అధికారంలోకి వచ్చాక.. ఇరాన్ అణు కార్యక్రమాన్ని తాత్కాలికంగా స్తంభింపజేశారు. ఇప్పుడు తాజాగా తమతోనే అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. అందుకు ఇరాన్ ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో ఇరాన్-అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో చూడాలి.

 

​ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చేస్తేనే ఇరాన్ సుభిక్షంగా ఉంటుందని ఇరాన్ రాజవంశీయుడు రెజా పహ్లవి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *