Iran | ఫోర్డో అణుకేంద్రాన్ని ఇరాన్‌ తరలించిందా..? ఉపగ్రహ చిత్రాలు ఏం చెబుతున్నాయంటే..?

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Fordo Muclear Center

Iran | ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలపై అమెరికా బీ-2 స్టెల్త్‌ బాంబర్లతో దాడులకు చేసింది. ఇందులో కీలకమైన ఫోర్డో అణుకేంద్రం ఒకటి. దీనిపై సైతం అమెరికా బంకర్‌ బస్టర్‌ బాంబులు ప్రయోగించింది. అయితే, అగ్రరాజ్యం దాడులను ముందే పసిగట్టిన ఇరాన్‌ ఫోర్డో అణుకేంద్రం నుంచి అవసరమైన కీలకమైన సామగ్రిని రహస్య స్థావరానికి తరలించినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన శాటిలైట్‌ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. జూన్‌ 19, 20 తేదీలకు సంబంధించిన హైల్ల్యూషన్‌ ఉపగ్రహ చిత్రాలు బయటకు వచ్చాయి. ఈ చిత్రాల్లో ఫోర్డో అణుకేంద్రానికి సమీపంలో భారీ ట్రక్కుల కదలిక ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ 19న ఫోర్డో అణు కేంద్రం సమీపంలో దాదాపు 16 కార్గో ట్రక్కులు బారులు తీరి కనిపించాయి.

అలాగే, జూన్ 20న కూడా ఇలాంటి దృశ్యమే కనిపించింది. దాంతో కీలమైన పరికరాలను తరలించినట్లుగా అనుమానిస్తున్నారు. ఇరాన్‌ అణుకేంద్రానికి సంబంధించిన సామగ్రినంతా విజయవంతంగా తరలించిందా ? తరలిస్తుండగానే అమెరికా దాడులు చేసిందా? అన్నది స్పష్టంగా తెలియరాలేదు. అమెరికా బంకర్ బస్టర్ బాంబులతో అణుకేంద్రాన్ని నాశనం చేసింది. ఫోర్డో అణు కేంద్రం భూగర్భంలో నిర్మించగా.. సాధారణ మిస్సైల్స్‌తో నాశనం చేయడం అసాధ్యం. ఇజ్రాయెల్ సైతం ఇంతకు ముందుకు దాడులు చేసి.. పెద్దగా ప్రభావం కనిపించలేదు. తాజాగా అమెరికా ప్రత్యేకమైన బీ-2 స్టెల్త్ బాంబర్‌ నుంచి బంకర్‌ బస్టర్ బాంబులతో దాడులకు పాల్పడింది. సొరంగాలు, బంకర్లను నాశనం చేసేందుకు ఈ బంకర్‌ బాంబులను ఉపయోగిస్తారు.

ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా 30వేల పౌండ్ల బరువున్న ఆరు బంకర్ బస్టర్ బాంబులను అమెరికా ప్రయోగించిందని.. దాంతో భారీగా నష్టం కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫోర్డో అణుకేంద్రం ధ్వంసమైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. దాడులపై ఆయన మాట్లాడుతూ.. ఇరాన్‌లో శాంతి మార్గంలో పయనించేందుకు ఇంకా సమయం ఉందని.. అది యుద్ధాన్ని ఆపాల్సి ఉందన్నారు. ఇరాన్‌ ఇప్పుడు దాడి చేస్తే.. తాము సైతం దాడులు చేస్తామన్నారు. శాంతి లేకపోతే, విధ్వంసం ఉంటుందని.. అన్ని లక్ష్యాలపై ఇంకా దాడి జరగలేదన్నారు. త్వరలోనే శాంతి నెలకొనకపోతే ఇతర లక్ష్యాలపై ఖచ్చితత్వం.. వేగం, నైపుణ్యంతో దాడి చేస్తామని హెచ్చరించారు.

​Iran | ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలపై అమెరికా బీ-2 స్టెల్త్‌ బాంబర్లతో దాడులకు చేసింది. ఇందులో కీలకమైన ఫోర్డో అణుకేంద్రం ఒకటి. దీనిపై సైతం అమెరికా బంకర్‌ బస్టర్‌ బాంబులు ప్రయోగించింది. అయితే, అగ్రరాజ్యం దాడులను ముందే పసిగట్టిన ఇరాన్‌ ఫోర్డో అణుకేంద్రం నుంచి అవసరమైన కీలకమైన సామగ్రిని రహస్య స్థావరానికి తరలించినట్లుగా సమాచారం. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *