Iran: వారిద్దరూ దేవుని శత్రువులు.. ట్రంప్, నెతన్యాహుకు ఇరాన్ మతాధికారి ఫత్వా జారీ

Follow

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును దేవుని శత్రువులుగా పరిగణిస్తూ ఇరాన్‌లోని ప్రముఖ షియా మతాధికారి అయతుల్లా నాజర్ కమరెం షిరాజీ ఫత్వా జారీ చేశారు. వీరికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా వీరిద్దరికి ఏ ముస్లిం నాయకులు కూడా మద్దతు ఇవ్వొద్దని ఫత్వాలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి:Anchor Swetcha : నా భర్త నిర్దోషి, అమాయకుడు.. తెరపైకి నిందితుడు పూర్ణచందర్ భార్య స్వప్న
దేవుని శత్రువులైన ట్రంప్, నెతన్యాహు మాటలకు, వారి తప్పులకు పశ్చాత్తాపపడేలా చేయాలని ముస్లింలను షిరాజీ కోరారు. నాయకుడిని బెదిరించే ఏ వ్యక్తైనా.. ప్రభుత్వమైనా అట్టివారిని మొహరేబ్(దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసే వ్యక్తి)గా పరిగణిస్తారని షిరాజీ ఫత్వాలో పేర్కొన్నట్లు ఒక న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మొహరేబ్‌గా గుర్తించబడిన వ్యక్తులకు ఉరిశిక్ష, శిలువ వేయడం, అవయవాలను విచ్ఛేధనం చేయడం లేదా బహిష్కరించబడతారని ఫ్యాక్స్ న్యూస్ నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా ముస్లింలు లేదా ఇస్లామిక్ దేశాలు.. శత్రువులకు ఏదైనా సహకారం, మద్దతు ఇవ్వడం నిషేధం ఉంటుంది. శత్రువులు పశ్చాత్తాపపడేలా చేయడం అవసరం అని ఫత్వాలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Bollywood : అర్ధనగ్నంగా వీధుల్లో బాలీవుడ్ బ్యూటీ.. మండిపడుతున్న నెటిజన్లు
జూన్ 13న ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. అంతేకాకుండా ఇరాన్ కమాండర్లు సహా అణు శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అమెరికా కూడా రంగంలోకి దిగింది. అణు స్థావరాలే లక్ష్యంగా శక్తివంతమైన బాంబర్లను ప్రయోగించింది. యుద్ధ తీవ్రత ఎక్కువ అవుతున్న సమయంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ప్రకటించారు. అనంతరం ఇరాన్, ఇజ్రాయెల్ కూడా అధికారికంగా ప్రకటించాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొంది.