Iran-Israel: ఫోర్డో అణు కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ మరోసారి దాడి

Follow

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించగా.. మధ్యలో అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చి ముఖ్యమైన అణు కేంద్రాలైన ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహన్‌లపై దాడులు చేసింది. ఈ దాడుల్లో అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయి. తాజాగా ఫోర్డ్‌లోని భూగర్భ అణు శుద్ధి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తోంది. ఈ మేరకు ఇరాన్ మీడియా పేర్కొంది. టెహ్రాన్‌లోని పలు ప్రాంతాలపైనా దాడులు జరుగుతున్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Amaravati: అమరావతిలో భూ కేటాయింపులు.. కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు..
తమతోనే అణు ఒప్పందం చేసుకోవాలని ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి పెట్టింది. అందుకు ఇరాన్ అంగీకరించలేదు. ఎవరితోనూ ఒప్పందం చేసుకోమంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తేల్చిచెప్పారు. దీంతో అగ్ర రాజ్యం అమెరికా కోపం తెప్పించింది. ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఇంతలోనే ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. మరో అవకాశం ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించినా ఇరాన్ అంగీకరించలేదు. దీంతో అమెరికా కూడా ఇజ్రాయెల్‌తో కలిసి రంగంలోకి దిగింది. అమెరికా దగ్గర ఉన్న ప్రపంచంలోనే శక్తివంతమైన బీ-2 స్పిరిట్ బాంబర్లను అణుకేంద్రాలపై ప్రయోగించింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ సైన్యంతో కలిసి దాడులు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం అధికారికంగా వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Raviteja: ఆగస్టులో ‘మాస్ జాతర’ చేయాల్సిందే!
ఇక అమెరికా చర్యలపై ఇరాన్ కూడా తీవ్రంగా స్పందించింది. అణుస్థావరాలపై చేసిన దాడికి అగ్రరాజ్యం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఇక తాజాగా ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇంత నష్టం జరిగింది అన్నది ఇంకా తెలియలేదు. మరోవైపు ఇజ్రాయెల్ విద్యుత్ కేంద్రాలపై ఇరాన్ కూడా దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్‌లో పలు ప్రాంతాల్లో చీకటి కమ్ముకున్నాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించగా.. మధ్యలో అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చి ముఖ్యమైన అణు కేంద్రాలైన ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహన్‌లపై దాడులు చేసింది.