July New Rules: ప్రజలందరికీ బిగ్ అలర్ట్.. ఇవ్వాల్టి నుంచి మారనున్న రూల్స్ ఇవే..

Follow

దేశవ్యాప్తంగా కొన్ని అంశాల్లో కీలక మార్పులు జరగబోతున్నాయి. జులై 1 (మంగళవారం) నుంచి పలు కీలక రూల్స్ మారబోతున్నాయి. పాన్‌కార్డ్, బ్యాంకింగ్, రైల్వే టికెట్ బుకింగ్, గ్యాస్ సిలిండర్ ధర, క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పాన్ కార్డ్ నుంచి రైలు టికెట్ వరకు అమలయ్యే కొత్త నిబంధనలపై ఓ లుక్కేయండి..
ప్రధానంగా.. నేటి నుంచి రైలు టికెట్ చార్జీలు పెరగనున్నాయి. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ, నాన్ ఏసీ క్లాస్ చార్జీలను పెంచనున్నట్లు రైల్వేమంత్రిత్వ శాఖ ప్రకటించింది. నాన్ ఏసీ కేటగిరిల్లో టికెట్‌పై కిలోమీటర్‌కు ఒక పైసా, థర్డ్ ఏసీ నుంచి ఫస్ట్ ఏసీ వరకు అన్ని క్లాస్‌లలో కిలోమీటర్‌కు 2 పైసలు పెరుగనున్నాయి. అందులోనూ దూరాన్ని బట్టి టిక్కెట్ రేట్లలో మార్పులు ఉన్నాయి.
అలాగే.. తత్కాల్ టికెట్ల బుకింగ్‌ను కఠిన తరం చేసింది. ఇకపై తత్కాల్ టికెట్లు ఐఆర్‌సీటీసీ అకౌంట్‌తో ఆధార్ లింక్ చేసిన ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు.. ఓటీపీ ఆధారిత అథంటికేషన్ తప్పనిసరి చేసింది.
పాన్ కార్డుల రూల్స్ సైతం మారబోతోన్నాయి. కొత్త పాన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ కార్డు కాపీని అందించడం మస్ట్ అంటోంది. ఇప్పటికే పాన్, ఆధార్ కార్డు ఉంటే.. వాటిని లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిని లింకు చేసుకునేందుకు డిసెంబర్ 31 వరకు అనుమతి ఇచ్చింది.
2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2025.. ఈ క్రమంలో CBDT దాని గడువును పొడిగించింది. దీని ప్రకారం, సెప్టెంబర్ 15, 2025ని చివరి తేదీగా ప్రకటించారు.
అన్ని రకాల క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపు కోసం కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానుంది. భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థ (BBPS) ద్వారానే అన్ని క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది.
బ్యాంక్ ఏటీఎం, యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించనున్నారు. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎం రూల్స్‌లో మార్పులు చేశాయి. నెలలో ఐదుసార్లు మాత్రమే ఉచితంగా నగదు విత్‌డ్రాకి అవకాశం ఇచ్చింది.
అలాగే..గేమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లపై 10వేల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే క్రెడిట్ కార్డులపై ఒక్క శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
గ్యాస్ సిలిండర్ ధరల్లోనూ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ మార్పులు వంట గ్యాస్‌తోపాటు.. వాణిజ్య సిలిండర్ ధరలపైనా ప్రభావం చూపవచ్చు. వాణిజ్య గ్యాస్ ధర స్వల్పంగా తగ్గింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
దేశవ్యాప్తంగా కొన్ని అంశాల్లో కీలక మార్పులు జరగబోతున్నాయి. జులై 1 (మంగళవారం) నుంచి పలు కీలక రూల్స్ మారబోతున్నాయి. పాన్‌కార్డ్, బ్యాంకింగ్, రైల్వే టికెట్ బుకింగ్, గ్యాస్ సిలిండర్ ధర, క్రెడిట్ కార్డులకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా.. నేటి నుంచి రైలు టికెట్ చార్జీలు పెరగనున్నాయి.