Kajal : మళ్లీ ఫామ్‌లోకి కాజల్.. ఏకంగా బోల్డ్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్!

Follow

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొన్నేళ్ల పాటు ఊపు ఊపిన సంగతి తెలిసిందే. 2007లో లక్ష్మి కళ్యాణం, చందమామ వంటి చిత్రాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి తన నటన, అందం తో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో వరుసగా ఆఫర్లు అందుకుని అనతి కాలంలోనే స్టార్ హీరోలకు జోడీగా నటించి, తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీలో నటించిన కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాల జోరును తగ్గించింది. పెళ్లి, ప్రెగ్నెన్సీ, పిల్లలు కారణంగా కొంత గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. సెకండ్ ఇన్సింగ్‌ను మొదలు పెట్టింది. ఈ క్రమంలో తాజాగా తనకు రాబోయే చిత్రాల గురించి కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
Also Read : Shekar kamula : ఫైనల్‌గా ‘లీడర్ 2’పై క్లారిటీ ఇచ్చిన శేఖర్ కమ్ముల!
తాజాగా సినీ వర్గాల్లో వైనల్ అవుతున్న విషయం ఏమిటంటే, కాజల్ త్వరలో బోల్డ్ పాత్రలో కనిపించబోతుందట. ఇప్పటికే తమన్నా, ఇలియానా, టబు లాంటి సీనియర్ హీరోయిన్లు బోల్డ్ కంటెంట్‌తో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తూ కనిపించిన నేపథ్యంలో, కాజల్ కూడా ఇదే దారిలో వెళ్తోందన్నది టాక్. అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతే కాదు ఇక మరో హాట్ అప్‌డేట్ ఏమిటంటే, కాజల్ అగర్వాల్ త్వరలో దర్శకురాలిగా కూడా మారబోతోందట. తన డైరెక్షన్‌లో రూపొందే చిత్రంలో ఆమె లీడ్ రోల్ కూడా పోషించబోతోందని సమాచారం. ఈ సినిమా పై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక కాజల్ ప్రస్తుతం ‘కన్నప్ప’ చిత్రంలో పార్వతీ గా కీలక పాత్రలో నటిస్తోంది. జూన్ 27న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అలాగే ఆమె ‘ది ఇండియా స్టోరీ’, ‘ఇండియన్ 3’, బాలీవుడ్ ‘రామాయణ: పార్ట్ 1’ వంటి ప్రాజెక్టులలో కూడా బిజీగా ఉంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొన్నేళ్ల పాటు ఊపు ఊపిన సంగతి తెలిసిందే. 2007లో లక్ష్మి కళ్యాణం, చందమామ వంటి చిత్రాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి తన నటన, అందం తో ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో వరుసగా ఆఫర్లు అందుకుని అనతి కాలంలోనే స్టార్ హీరోలకు జోడీగా నటించి, తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, హిందీలో నటించిన కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాల జోరును