Kannappa Movie: ఊహకు మించి ‘కన్నప్ప’.. ‘మైల్ స్టోన్’ చిత్రం అవుతుంది: డిప్యూటీ సీఎం

Follow

‘కన్నప్ప’ చిత్రం ఊహకు మించి ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అర్జునుడు, తిన్నడు, కన్నప్పగా మంచు విష్ణు అద్భుతంగా నటించారని కొనియాడారు. కన్నప్ప కథ, కథనం, విజువల్స్, యాక్టింగ్ అన్ని గొప్పగా అనిపించాయని.. ఇదొక మైల్ స్టోన్ చిత్రం అవుతుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. చాలా రోజుల తరువాత మంచి చిత్రాన్ని చూశానని సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా కన్నప్ప. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.
కన్నప్ప సినిమాను డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా మరికొందరు ఆదివారం రాత్రి ప్రత్యేకంగా వీక్షించారు. రాజకీయ ప్రముఖులతో పాటుగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కూడా ఈ స్పెషల్ స్క్రీనింగ్‌లో సందడి చేశారు. కన్నప్ప చిత్రాన్ని వీక్షించిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ… ‘కన్నప్ప చిత్రం ఊహకు మించి ఉంది. అర్జునుడు, తిన్నడు, కన్నప్పగా విష్ణు అద్భుతంగా నటించారు. ఇంత గొప్ప చిత్రం నిర్మించిన మోహన్ బాబు గారికి నా అభినందనలు. కథ, కథనం, విజువల్స్, యాక్టింగ్.. అన్ని గొప్పగా అనిపించాయి. ఇదొక మైల్ స్టోన్ చిత్రం అవుతుంది’ అని అన్నారు.
Also Read: All-Time XI: టీ20 ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్, కోహ్లీకి నో ప్లేస్!
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ… ‘చాలా రోజుల తరువాత మంచి చిత్రాన్ని చూశాను. ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించిన మోహన్ బాబు గారికి, మంచు విష్ణుకి ధన్యవాదాలు. శివ భక్తులు అందరూ పరవశించి పోయేలా సినిమాను తీశారు. మేం అందరం ఈ సినిమా చూసి ఎంతో ఆనందించాం. మన కథను అందరికీ తెలిసేలా చేయాలి. ఇలాంటి చిత్రాల్ని అప్పుడప్పుడు అయినా తీయాలని సినిమాటోగ్రఫీ మినిస్టర్‌గా నేను అందరిని కోరుతున్నా’ అని అన్నారు.
‘కన్నప్ప’ చిత్రం ఊహకు మించి ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అర్జునుడు, తిన్నడు, కన్నప్పగా మంచు విష్ణు అద్భుతంగా నటించారని కొనియాడారు. కన్నప్ప కథ, కథనం, విజువల్స్, యాక్టింగ్ అన్ని గొప్పగా అనిపించాయని.. ఇదొక మైల్ స్టోన్ చిత్రం అవుతుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. చాలా రోజుల తరువాత మంచి చిత్రాన్ని చూశానని సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా కన్నప్ప. జూన్