Kavya Maran : ఎట్ట‌కేల‌కు మౌనం వీడిన కావ్య మార‌న్‌.. ఐపీఎల్‌లో త‌న మీమ్స్ , రియాక్ష‌న్స్ గురించి..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Kavya Maran Breaks Silence On Becoming Meme Fodder In IPL

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఫ్రాంచైజీ య‌జ‌మాని కావ్య మార‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఐపీఎల్ జ‌రిగే స‌మ‌యంలో ఆమె వ్య‌క్తం చేసే భావోద్వేగాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆమె అందానికి ఫిదా అయి.. ఆమె కోస‌మే కొంద‌రు మ్యాచ్‌ల‌ను చూస్తుంటారు అంటే అతి శ‌యోక్తి కాదేమో. ఇక ఆమెపై నెట్టింట ఎన్నో మీమ్స్ కూడా వ‌స్తుంటాయి. కెమెరామెన్లు సైతం మ్యాచ్ జ‌రిగే సంద‌ర్భాల్లో ఆమెపై ఎక్కువ‌గానే ఫోక‌స్ చేస్తుంటారు కూడా.

అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా వీటిపై స్పందించ‌ని కావ్య తాజాగా వీటిపై మాట్లాడారు. ‘మీరు చూసేవి నా నిజ‌మైన భావోద్వేగాలు. ఇక హైద‌రాబాద్‌లో నేనే ఏమీ చేయ‌లేను. అక్క‌డే కూర్చోవాలి. నేను కూర్చోగ‌లిగే ఏకైక స్థ‌లం అదే. అయితే.. అహ్మ‌దాబాద్‌, చెన్నైకి వెళ్లిన‌ప్పుడు చాలా అడుగుల దూరంలో ఎక్క‌డో కూర్చోన్న‌ప్పుడు కూడా కెమెరామెన్ న‌న్ను క‌నుగొన‌గ‌లుగుతున్నాడు. కాబ‌ట్టి అది మీమ్స్ గా ఎలా మారుతుందో నాకు అర్థ‌మ‌వుతోంది.’ అని కావ్య అంది.

ENG vs IND : భార‌త్‌తో రెండో టెస్టు.. 48 గంట‌ల ముందుగానే తుది జ‌ట్టును ప్ర‌క‌టించిన ఇంగ్లాండ్‌.. స్టార్ పేస‌ర్‌కు నో ఛాన్స్‌..

ముంబై ఇండియ‌న్స్ య‌జ‌మాని నీతా అంబానీ లాగే కావ్య మార‌న్ సైతం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆడే ప్ర‌తి మ్యాచ్‌ను త‌ప్ప‌కుండా ప్ర‌త్య‌క్షంగా వీక్షిస్తుంటుంది. గ‌త రెండు సీజ‌న్లుగా ఎస్ఆర్‌హెచ్ టీమ్‌ను ఎంతో బ‌లంగా తీర్చిదిద్దింది.

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై ప్రాణం పెట్టాన‌ని, అందుక‌నే ఆ జ‌ట్టు ఓట‌ముల‌ను, విజ‌యాల‌ను తాను వ్య‌క్తిగ‌తంగా తీసుకుంటాన‌ని కావ్య తెలిపింది. ‘సన్‌రైజర్స్ విషయానికి వస్తే.. నేను నిజంగా నా హృదయాన్ని అందులో పెట్టాను. మీరు మీ హృదయాన్ని, ఆత్మను దేనిలోనైనా పెట్టినప్పుడు.. మీరు సహజంగానే దాని విజయాలు, వైఫల్యాలతో చాలా వ్యక్తిగతంగా తీసుకుందారు.’ అని కావ్య చెప్పింది.

Team India : హ్యాపీ రిటైర్‌మెంట్ జ‌డేజా.. రెండు కేక్‌లు క‌ట్ చేసిన టీమ్ఇండియా ఆట‌గాళ్లు..

స‌న్‌రైజ‌ర్స్ 2016లో చివ‌రిసారిగా టైటిల్‌ను గెలుచుకుంది. అప్ప‌టి నుంచి రెండు సార్లు అంటే 2018, 2024 సీజ‌న్ల‌లో ఫైన‌ల్‌కు చేరుకుంది. కానీ తృటిలో టైటిల్‌ను చేజార్చుకుంది. రెండో టైటిల్‌ను సొంతం చేసుకోవాల‌ని ఆరాట‌ప‌డుతోంది.

​స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఫ్రాంచైజీ య‌జ‌మాని కావ్య మార‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *