Kothagudem Urban : ఉద్యమకారుల ఆశయ సాధ‌న‌కు కృషి : రాజేశ్ నాయ‌క్‌

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Kothagudem Urban : ఉద్యమకారుల ఆశయ సాధ‌న‌కు కృషి : రాజేశ్ నాయ‌క్‌

కొత్తగూడెం అర్బన్, మే 2 : మారోజు వీరన్న, ఠానూనాయక్‌ల‌ ఆశయాలు, లక్ష్యాల సాధన కోసం పని చేస్తామని లంబాడీ హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు గుగు రాజేష్ నాయక్ స్పష్టం చేశారు. ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కొత్తగూడెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్‌లో మంగ‌ళ‌వారం ఘనంగా నిర్వహించారు. తొలుత జెండాను ఆవిష్కరించి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్‌నాయ‌క్ మాట్లాడారు. కొండల్లో, కోనల్లో, అడవుల్లో కొట్టుమిట్టాడుతున్న లంబాడీ జాతిని రాజ్యాధికారం వైపు నడిపించడానికి 1997లో ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భవించిందని, ఆనాటి నుండి నేటి వరకు లంబాడీ హక్కుల కోసం అలుపెరుగకుండా పోరాటాలు, ఉద్యమాలు చేస్తూనే ఉన్న‌ట్లు తెలిపారు. మా తండాలో మా రాజ్యం నినాదంతో మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తండాలను పంచాయతీలుగా గుర్తించారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేసి జాతిని జాగృతం చేస్తామని ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కుల గణనలో లంబాడా జనాభాను బహిర్గతం చేయాలని, గిరిజనులు సాగు చేసుకుంటున్న అన్నీ రకాల భూములకు పట్టాలివ్వాలని, తెలంగాణ మంత్రి వర్గంలో లంబాడీలకు స్థానం కల్పించాలని, గోర్ బోలి భాషను అధికారికంగా గుర్తించి, కేంద్రప్రభుత్వం 8వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంతుల్యా నాయక్, భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి కన్వీనర్ మల్లెల రామనాధం, ఆదివాసీ పొలిటికల్ జాక్ కన్వీనర్ వాసం రామకృష్ణ దొర, గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ, ఆదివాసీ, గిరిజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల కన్వీనర్లు, రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులు ఇర్ఫా ప్రకాశ్‌, రమేశ్‌, జుంకీలాల్, బోడాలాలు, ఉపేందర్ నాయ‌క్‌, చిట్టిబాబు గోబ్రియానాయక్, నెహ్రూ నాయక్, కృష్ణ, రాము, ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా నాయకులు లాలు నాయక్, మశల్ నాయక్, వీరన్న, నగేశ్‌, నీలావర్ధన్, రంగా, శ్రీను, జానకీరామ్, సాయి పాల్గొన్నారు.

​మారోజు వీరన్న, ఠానూనాయక్‌ల‌ ఆశయాలు, లక్ష్యాల సాధన కోసం పని చేస్తామని లంబాడీ హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు గుగు రాజేష్ నాయక్ స్పష్టం చేశారు. ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కొత్తగూడెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్‌లో మంగ‌ళ‌వారం ఘనంగా నిర్వహించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *