Kothagudem Urban : సోలార్ విద్యుత్‌ వినియోగంపై దృష్టి సారించండి : ట్రైనీ కలెక్టర్ సౌరబ్‌ శర్మ

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Kothagudem Urban : సోలార్ విద్యుత్‌ వినియోగంపై దృష్టి సారించండి : ట్రైనీ కలెక్టర్ సౌరబ్‌ శర్మ

కొత్తగూడెం అర్బన్, జులై 1 : సోలార్ విద్యుత్ వినియోగంపై దృష్టి సారించాల‌ని ట్రైనీ కలెక్టర్ సౌరబ్‌ శర్మ అన్నారు. మంగళవారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇంజినీరింగ్ సెక్షన్‌లో రికార్డులను పరిశీలించిన ఆయ‌న‌ పలు అంశాలను కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. వీధి దీపాలు, మంచినీరు సరఫరా చేసే బోర్లు ఎన్ని ఉన్నాయి, ఎన్నిరోజులకొకసారి ప్రజలకు నీటిని అందిస్తున్నారు, ఫిల్టర్ బెడ్ ఎక్కడ ఉంది, ఎన్ని ఓవర్ హెడ్ ట్యాంక్‌లు ఉన్నాయి, ఎన్ని రోజులకొకసారి ట్యాంక్‌ల‌ను శుభ్రం చేస్తారు, మంచినీటి పైప్ లైన్ వ్యవస్థ పనితీరు, ఎంతమంది ఇంజినీరింగ్ సెక్షన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు తదితర అంశాలను ఆయ‌న‌ అడిగి తెలుసుకున్నారు.

వీధి దీపాలకు, బోర్లకు ఎంత కరెంట్ బిల్ చెల్లిస్తున్నారని అడుగ‌గా డీఈ రవికుమార్ సుమారు రూ.7 నుండి రూ.10 లక్షలు చెల్లిస్తున్న‌ట్లు తెలిపారు. దీంతో సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తే కరెంట్ బిల్ నుండి ఉపశమనం పొందవచ్చని తెలిపారు. తద్వారా మున్సిపల్ కార్పొరేషన్ విద్యుత్ సంస్థకు చెల్లించే బిల్లు నుండి ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. సోలార్ వినియోగిస్తే సుమారు రూ.5 లక్షలే అవుతాయని, రూ.5 లక్షలు ఆదా అవుతాయ‌ని సూచించారు. డ్రైనేజీ వ్యవస్థ పనితీరును అడిగి తెలుసుకుని, ఎస్‌టీపీ (సివ‌రేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్) ల‌పై ఆరా తీశారు. సుజాతనగర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో నీటి సౌకర్యం లేదని ఉపాధ్యాయులు తన పర్యటనలో దృష్టికి తీసుకువచ్చారని సమస్యను పరిష్కరించాలని సూచించారు.

​సోలార్ విద్యుత్ వినియోగంపై దృష్టి సారించాల‌ని ట్రైనీ కలెక్టర్ సౌరబ్‌ శర్మ అన్నారు. మంగళవారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఇంజినీరింగ్ సెక్షన్‌లో రికార్డులను పరిశీలించిన ఆయ‌న‌ పలు అంశాలను కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *