Kuberaa Movie: నాగార్జున, ధనుష్‌ల ఎమోషనల్ డ్రామా.. కుబేర సినిమా ఎలా ఉందంటే?

Follow

ఇక కుబేర కథలోకి వెళితే.. నీరజ్ అలియాస్ జిమ్ సార్బ్, దేశంలోనే అతిపెద్ద బిజినెస్ మెన్‌లో ఒకరు. ఆయనకు బంగాళాఖాతంలో.. యావత్ దేశానికి 15 ఏళ్ళ పాటు సరిపోయేంత ఆయిల్ గనులు దొరుకుతాయి. దాన్ని దక్కించుకోడానికి ప్రభుత్వంతో డీల్ మాట్లాడుకుంటాడు. దానికోసం వేల కోట్ల ట్రాన్సాక్షన్ చేయించాల్సి వస్తుంది. అలా ఎవరు చేస్తారు అని ఆలోచిస్తున్న సమయంలో వాళ్ల దృష్టిలోకి వస్తాడు దీపక్ తేజ్ అలియాస్ నాగార్జున. కానీ ఆయన జైల్లో ఉంటాడు. అసలు దీపక్ జైల్లో ఎందుకున్నాడు..? వీళ్ళందరి జీవితంలోకి బిచ్చమెత్తుకుని బతికే దేవా అలియాస్ ధనుష్ ఎలా వచ్చాడు..? దేవా లైఫ్‌లోకి రష్మిక మందన్న ఎలా వచ్చింది..? అసలు వాళ్లందరి జీవితాలు ఎలా మారిపోయాయి అనేది ఈ సినిమా కథ
శేఖర్ కమ్ముల.. ఎప్పుడూ కూల్‌గా కామ్‌గా.. మీడియం బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించే ఈయన.. ఈ సారి చాలా గ్రాండ్ స్కేల్లో కుబేర సినిమాను తెరకెక్కించాడు. నాగార్జున, ధనుష్‌ను తన లీడ్స్‌గా ఎంచుకున్నాడు. టీజర్ అండ్ ట్రైలర్‌తో ఈ సినిమాపై మంచి అంచనాలనైతే పెంచాడు. మరి ఆ అంచనాలను అందుకున్నాడా? కుబేర ప్రేక్షకుల మెప్పు పొందిందా? లేదా? అనేది ఈ రివ్యూలో చూద్దాం..!