Laya : బాలకృష్ణ మూవీ కోసం ఏడ్చారా.. లయ క్లారిటీ..
Follow

Laya : సీనియర్ హీరోయిన్ చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోంది. యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తమ్ముడు మూవీలో ఆమె కీలక పాత్ర చేస్తోంది. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. జులై 4న రిలీజ్ కాబోతోంది. దీన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో లయకు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. చెన్నకేశవరెడ్డి మూవీలో బాలకృష్ణకు సిస్టర్ గా చేయాలని వివి వినాయక్ అడిగితే మీరు ఏడ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. నిజమేనా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు.
Read Also : Kubera : కుబేర మేకింగ్ వీడియో.. ధనుష్ కష్టం చూడండి..
లయ స్పందిస్తూ.. ఏమో నాకు సరిగ్గా గుర్తు లేదు. ఆ మూవీ వచ్చి చాలా ఏళ్లు అవుతోంది. ఒకవేళ ఏడిస్తే ఏడ్చానేమో. బాలకృష్ణ గారితో అప్పట్లో నటించాలని నాకు ఉండేది’ అంటూ తెలిపింది ఈ బ్యూటీ. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో లయ చాలా మంది హీరోల సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె తమ్ముడు మూవీతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇన్నేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
Read Also : Vijay Thalapathy : విజయ్ జననాయగన్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్..
Laya : సీనియర్ హీరోయిన్ చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోంది. యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తమ్ముడు మూవీలో ఆమె కీలక పాత్ర చేస్తోంది. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. జులై 4న రిలీజ్ కాబోతోంది. దీన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో లయకు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. చెన్నకేశవరెడ్డి మూవీలో బాలకృష్ణకు సిస్టర్ గా