LIC Jeevan Shanti Plan : LICలో స్పెషల్ ప్లాన్ మీకోసం.. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. జీవితాంతం లక్ష పెన్షన్ వస్తూనే ఉంటుంది..!

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
LIC Jeevan Shanti Plan

LIC Jeevan Shanti Plan : పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? అయితే, ఎందులో పెట్టుబడి పెడితే బెటర్ అని ఆలోచిస్తున్నారా? సాధారణంగా చాలామంది తమ సంపాదనలో (LIC Jeevan Shanti Plan) కొద్ది మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలని భావిస్తుంటారు.

భవిష్యత్తులో ఆర్థికంగా లోటు లేకుండా ఉండేందుకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది. ఎందులో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందంటే.. చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.. అందులో దేశంలోని అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ అందించే స్పెషల్ ప్లాన్ ఒకటి..

Read Also : LIC Housing Finance : కస్టమర్లకు LIC గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు భారీగా తగ్గింపు.. ఇకపై చౌకగా హోమ్ లోన్లు.. తగ్గనున్న ఈఎంఐల భారం..!

అదే.. ఎల్ఐసీ జీవన్ శాంతి ప్లాన్.. (LIC Jeevan Shanti Plan) ఈ ఇన్వెస్ట్ ప్లాన్ ద్వారా అద్భుతమైన రాబడిని పొందవచ్చు. ఎల్ఐసీ అన్ని వయసుల వారికి ఒక ప్లాన్ కాదు.. అనేక అద్భుతమైన ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఎల్ఐసీ రిటైర్మెంట్ ప్లాన్లకు ఫుల్ డిమాండ్ ఉంది.

రిటైర్మెంట్ తర్వాత రాబడి కోసం ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి ప్లాన్ తీసుకోవచ్చు. సింగిల్ ప్రీమియం ప్లాన్. మీరు ఒకసారి పెట్టుబడి పెడితే చాలు.. ప్రతి ఏడాది రూ. లక్ష వరకు పెన్షన్ పొందవచ్చు. ఈ ప్రత్యేక పాలసీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఒకేసారి పెట్టుబడి.. జీవితాంతం పెన్షన్ :
సంపాదనలో కొంత మొత్తాన్ని ఆదా చేస్తే.. రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా లోటు ఉండదు. అందుకే చాలామంది పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. అయితే, ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి పాలసీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ పాలసీ ఒకేసారి పెట్టుబడితో రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందవచ్చు.. అంటే.. జీవితాంతం పెన్షన్ వస్తూనే ఉంటుంది.

వయోపరిమితి ఎంతంటే? :
ఎల్ఐసీ ఈ పాలసీ కోసం వయోపరిమితి 30 ఏళ్ల నుంచి 79 ఏళ్లు మధ్య ఉండాలి. ఈ ప్లాన్‌లో రిస్క్ కవర్ లేదు. ఈ LIC ప్లాన్‌ కోసం కంపెనీ రెండు ఆప్షన్లను అందిస్తుంది. సింగిల్ లైఫ్ కోసం డిఫర్డ్ యాన్యుటీ, రెండోది జాయింట్ లైఫ్ కోసం డిఫర్డ్ యాన్యుటీ. మీరు కోరుకుంటే.. ఒకే ప్లాన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. లేదంటే జాయింట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

జీవితాంతం లక్ష పెన్షన్ ఎలా? :
ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి పథకం (LIC Jeevan Shanti Plan) కింద యాన్యుటీ ప్లాన్ తీసుకుంటే.. పెన్షన్ పరిమితిని పెంచుకోవచ్చు. రిటైర్మెంట్ తర్వాత జీవితాంతం ఫిక్స్‌డ్ పెన్షన్ పొందవచ్చు. మంచి వడ్డీని కూడా పొందవచ్చు. ఈ పథకం ప్రకారం.. 55 ఏళ్ల వ్యక్తి ఈ పథకాన్ని తీసుకుంటే.. రూ. 11 లక్షలు డిపాజిట్ 5 ఏళ్లు చేయాలి. ఏకమొత్తం పెట్టుబడిపై ఏడాదికి రూ. 1,01,880 కన్నా ఎక్కువ పెన్షన్ పొందవచ్చు. 6 నెలల ప్రాతిపదికన పెన్షన్ మొత్తం రూ. 49,911, నెలవారీ పెన్షన్ రూ. 8,149గా అవుతుంది.

Read Also : 7 Seater Cars Discount : కొంటే ఇలాంటి కార్లు కొనాలి.. ఈ 7 సీటర్ కార్లపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్..!

పాలసీ సరెండర్ ఫెసిలిటీ :
ఎల్‌ఐసీ న్యూ జీవన్ శాంతి ప్లాన్ (Jeevan Shanti Plan) కోసం యాన్యుటీ రేట్లను కూడా పెంచారు. ఈ పథకంలో ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకాన్ని ఎప్పుడైనా సరెండర్ చేయవచ్చు. కనీసం రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పరిమితి అంటు ఏది లేదు. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే.. అతని బ్యాంకు అకౌంటులో మొత్తం డిపాజిట్ నామినీకి వస్తుంది

Disclaimer : పెట్టుబడిపై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. మీరు ఎల్ఐసీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే పూర్తి వివరాల కోసం ముందుగా అధికారిక వెబ్ సైట్ లేదా సమీపంలోని ఎల్ఐసీ ఆఫీసును సంప్రదించండి.

​LIC Jeevan Shanti Plan : రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎల్ఐసీ జీవన్ శాంతి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ తీసుకోండి.. ఒకసారి పెట్టుబడితో జీవితకాల పెన్షన్‌ పొందవచ్చు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *