Lucky Baskhar:100 కోట్ల లక్కీ భాస్కర్‌ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా? దుల్కర్ ఎలా వచ్చాడంటే?

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Lucky Baskhar:100 కోట్ల లక్కీ భాస్కర్‌ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా? దుల్కర్ ఎలా వచ్చాడంటే?

మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన మూడో తెలుగు సినిమా లక్కీ భాస్కర్. అంతకు ముందు అతను హీరోగా నటించిన మహానటి, సీతారామం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇదే కోవలో వచ్చిన లక్కీ భాస్కర్ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. గతేడాది దీపావళికి రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. బ్యాంకింగ్‌ సెక్టార్‌ నేపథ్యంలో ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భాస్కర్‌ అనే బ్యాంక్‌ ఉద్యోగి బ్యాంకింగ్‌ రంగంలోని లొసుగులను ఉపయోగించుకుని కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు అనేది చాలా ఆసక్తికరంగా చూపించాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఈ క్రమంలోనే మిడిల్ క్లాస్ ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఓటీటీలోనూ లక్కీ భాస్కర్ కు రికార్డ్ వ్యూస్ వచ్చాయి.

కెరీర్ ప్రారంభంలో తొలిప్రేమ, మిస్టర్ మజ్ఞు, రంగ్ దే లాంటి ప్రేమకథ చిత్రాలను తెరకెక్కించాడు వెంకీ అట్లూరి. అయితే ఆ తర్వాత తన రూట్ మార్చుకుని ధనుష్ తో సార్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీని తర్వాతనే లక్కీ భాస్కర్ ను తెరకెక్కించాడు. అయితే వెంకీ అట్లూరి ఈ సినిమా కథను ముందుగా తెలుగు హీరోలకే చెప్పాడట. అందులో న్యాచురల్ స్టార్‌ నాని కూడా ఒకరట. అయితే నాని ఎందుకోగానీ ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఇట లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన సినిమా కథలన్నీ మొదట అక్కినేని నాగ చైతన్యకే చెప్పానన్నాడు వెంకీ అట్లూరి. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాలేకపోవడం వల్ల చైతూతో తాను సినిమా చేయలేకపోయాన్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. అలా మొత్తానికి చివరకు దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ లోకి ఎంటర్ అయ్యాడన్నమాట.

న్యాచురల్ స్టార్  నాని పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో..

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

నా సినిమా కథలన్నీ మొదట నాగ చైతన్యకు చెప్పానంటోన్న వెంకీ అట్లూరి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

​దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. వెంకీ అట్లూరి తెరకెక్కించిన గతేడాది థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 100 కోట్ల కు పైగా వసూళ్లను సాధించింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *