Madhya Pradesh: విద్యార్థిని ఛాతిపై కూర్చుని, గొంతు కోసేశాడు.. మధ్యప్రదేశ్ ఆస్పత్రిలో దారుణ మర్డర్

Follow

నార్సింగ్‌పూర్: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని నార్సింగ్‌పూర్ ఆస్పత్రిలో దారుణమైన మర్డర్ జరిగింది. పట్టపగలే ఓ అమ్మాయిని గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన జూన్ 27వ తేదీన ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. మృతురాలు 19 ఏళ్ల సంధ్యా చౌదరీ. ఆమె 12వ తరగతి చదువుతున్నది. అభిషేక్ కోస్తి అనే వ్యక్తి ఆమెను హత్య చేశాడు. అమ్మాయి గొంతు కోస్తున్న వీడియో ఒకటి సోమవారం వైరల్ అయ్యింది. విద్యార్థినిపై దాడి చేస్తున్న సమయంలో ఆస్పత్రి సిబ్బంది, పేషెంట్లు అక్కడే ఉన్నా..వారేమీ అడ్డుకోలేకపోయారు. ఆస్పత్రి ఫ్లోర్‌పైనే రక్త స్త్రావం జరిగి ఆమె ప్రాణాలు విడించింది.
ఆస్పత్రికి చేరుకున్న సంధ్యను అభిషేక్ కొట్టాడు. ఆమెను నేలకు పడేశాడు. ఆమె ఛాతిపై కూర్చుని, తన వద్ద ఉన్న కత్తితో ఆమె గొంతు కోసేశాడు. ఎమర్జెన్సీ వార్డు సమీపంలో ఈ ఘటన జరిగింది. సమీపంలోనే డాక్టర్లు, గార్డులు ఉన్నా.. ఆ మర్డర్‌ను అడ్డుకోలేకపోయారు. పది నిమిషాల్లోనే ఇదంతా జరిగిపోయింది. నిందితుడు కూడా తన గొంతు కోసుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ తర్వాత అతను అక్కడ నుంచి బైక్ తీసుకుని పరారీ అయ్యాడు.
ఆస్పత్రిలో భద్రత లేకపోవడంతో.. ఆ మర్డర్ ఘటన అక్కడ ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లు భయంతో త్వరత్వరగా డిశ్చార్జ్ అయ్యారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సంధ్య ఆస్పత్రికి చేరుకున్నది. మెటర్నిటీ వార్డులో స్నేహితురాలి బంధువును కలిసేందుకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పింది. ఆస్పత్రి వద్ద మధ్యాహ్నం నుంచి చక్కర్లు కొడుతున్న అభిషేక్ కోస్తి.. సంధ్యను కలిశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది ప్రమాదకరంగా మారింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్ ఆస్పత్రిలో దారుణమైన మర్డర్ జరిగింది. పట్టపగలే ఓ అమ్మాయిని గొంతు కోసి చంపేశాడో ఉన్మాది. ఈ ఘటన జూన్ 27వ తేదీన ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది.