Mallu Ravi: బీఆర్‌ఎస్ ప్రోగ్రాంలో “రప్పా రప్పా” ఫ్లకార్డులు.. మల్లు రవి రియాక్షన్..

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Mallu Ravi Responds To Display Of Rappa Rappa Placards In Brs Program

వరంగల్ జిల్లాకు సంబంధించిన అంశం తన దృష్టికి వచ్చిందని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను అడిగి సమస్య తెలుసుకుంటానని స్పష్టం చేశారు. సమస్యను తెలుసుకొని పార్టీ లైన్ ప్రకారం ముందుకు వెళ్తామని వెల్లడించారు. వరంగల్, గజ్వెల్ రెండు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు.

READ MORE: Pakistan: ఇరాన్ పై అమెరికా దాడి.. తీవ్రంగా ఖండించిన పాకిస్తాన్..

అనంతరం.. బీఆర్ఎస్ కార్యక్రమంలో రప్పా.. రప్పా డైలాగ్ ఫ్లకార్డులపై మల్లు రవి స్పందించారు. “రప్పా రప్పా సినిమా డైలాగ్స్ చెప్తే రాజకీయలు నడుస్తాయి అనుకుంటే పెద్ద పొరపాటే.. బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలకి రప్పా రప్పా మాటలు చెప్పి అధికారం లోకి వచ్చారు. వాళ్ళు ఇష్టం ఇచ్చినట్లు పరిపాలన చేశారు. ఇప్పుడు పగటి కలలు కంటున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరు మీ పార్టీ ఏంటో తెలుస్తుంది.” అని మల్లు రవి వ్యాఖ్యానించారు.

READ MORE: OPPO A5 5G: మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో విడుదలైన ఒప్పో A5..!

కాగా.. సంగారెడ్డి జిల్లాలోని జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం రైతు మహా ధర్నా జరిగింది. 2028 లో రప్పా.. రప్పా 3.0 లోడింగ్ అంటూ ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. పటాన్ చెరు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలని జిన్నారంలో నిర్వహిస్తున్న రైతు ధర్నాలో రప్పా రప్పా ప్లకార్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

READ MORE: OPPO A5 5G: మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో విడుదలైన ఒప్పో A5..!

​వరంగల్ జిల్లాకు సంబంధించిన అంశం తన దృష్టికి వచ్చిందని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను అడిగి సమస్య తెలుసుకుంటానని స్పష్టం చేశారు. సమస్యను తెలుసుకొని పార్టీ లైన్ ప్రకారం ముందుకు వెళ్తామని వెల్లడించారు. వరంగల్, గజ్వెల్ రెండు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *