Man Kills Father Over Front Seat | ముందు సీటులో కూర్చోవడంపై వివాదం.. తండ్రిని కాల్చి చంపిన కొడుకు

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Gunfire

న్యూఢిల్లీ: వాహనం ముందు సీటులో కూర్చోవడంపై తండ్రీ, కొడుకు మధ్య వివాదం జరిగింది. ముందు సీటులో తాను కూర్చొంటానన్న తండ్రిపై కుమారుడు ఆగ్రహించాడు. తండ్రి లైసెన్స్ గన్‌తో కాల్పులు జరిపి హత్య చేశాడు. (Man Kills Father Over Front Seat) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. సీఐఎస్ఎఫ్‌లో పని చేసిన 60 ఏళ్ల సురేంద్ర సింగ్‌ ఆరు నెలల కిందట రిటైర్డ్ అయ్యారు. ఢిల్లీలోని తిమార్‌పూర్ ప్రాంతంలో నివసిస్తున్న ఆయన తన కుటుంబంతో కలిసి ఉత్తరాఖండ్‌లోని సొంత గ్రామానికి వెళ్లిపోవాలని నిర్ణయించారు.

కాగా, జూన్‌ 26న టెంపోను హైర్‌ చేశారు. లగేజ్‌ను అందులో లోడ్ చేశారు. అయితే వాహనం ముందు సీటులో కూర్చొనే విషయంపై తండ్రి సురేంద్ర సింగ్‌, అతడి కుమారుడైన 26 ఏళ్ల దీపక్ మధ్య వాగ్వాదం జరిగింది. వాహనంలో లగేజ్‌ ఉండటంతో ముందు సీటులో తాను కూర్చుంటానని సురేంద్ర సింగ్‌ పట్టుబట్టాడు. దీనిపై దీపక్‌ ఆగ్రహించాడు. తండ్రికి చెందిన లైసెన్స్ గన్‌తో ఆయనపై కాల్పులు జరిపాడు.

మరోవైపు గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో తిమార్‌పూర్ ప్రాంతంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు కాల్పుల శబ్ధం విన్నారు. వెంటనే అక్కడకు చేరుకున్నారు. సురేంద్ర సింగ్ రక్తం ముడుగుల్లో పడి ఉండటాన్ని గనించారు. అతడి కుమారుడు దీపక్‌ చేతిలోని గన్‌ లాక్కునేందుకు స్థానికులు ప్రయత్నించాన్ని చూశారు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, సురేంద్ర సింగ్‌ను హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో దీపక్‌ను అరెస్ట్‌ చేసినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read:

Acid On Pregnant Woman’s Abdomen | కాన్పు సమయంలో.. గర్భిణీ కడుపుపై యాసిడ్ రాసిన నర్సు

Man Organises Wife’s Wedding To Lover | మరో వ్యక్తితో భార్యకు సంబంధం.. దగ్గరుండి వారి పెళ్లి జరిపించిన భర్త

Watch: హైకోర్టు లైవ్ స్ట్రీమ్‌ విచారణకు టాయిలెట్ నుంచి హాజరైన వ్యక్తి.. వీడియో వైరల్‌

 

 

​Man Kills Father Over Front Seat | వాహనం ముందు సీటులో కూర్చోవడంపై తండ్రీ, కొడుకు మధ్య వివాదం జరిగింది. ముందు సీటులో తాను కూర్చొంటానన్న తండ్రిపై కుమారుడు ఆగ్రహించాడు. తండ్రి లైసెన్స్ గన్‌తో కాల్పులు జరిపి హత్య చేశాడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *