Manchu Vishnu: ప్రభాస్ నువ్ నా కృష్ణుడివి, నేను నీ కర్ణుడిని!​

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Kannappa Event Vishnu Manchu Prabhas Speech Hyderabad

కన్నప్ప సినిమా ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్లో మంచు విష్ణు, ప్రభాస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి స్నేహితులు రెండు రకాలు ఉంటారని ఒకరు కర్ణుడులా ఉంటే మరొకరు కృష్ణుడులా ఉంటారని చెప్పుకొచ్చారు. కృష్ణుడు నీ పక్కనే ఉంటూ నీకు దారి చూపిస్తూ నీ వెంటే ఉంటాను అంటాడు. కర్ణుడు నువ్వు ఏమన్నా చెయ్ ఏదైనా నేను చూసుకుంటా అంటాడు. నా జీవితంలో కృష్ణుడిగా ప్రభాస్ ఉన్నాడు.

Also Read:Kannappa: కన్నప్ప మీద మీ అభిప్రాయాలను మీ వరకే ఉంచుకోండి..శరత్ కుమార్ కీలక వ్యాఖ్యలు

అతను ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు కానీ తను కేవలం నాన్నగారి పైన ఉన్న ప్రేమ అభిమానం గౌరవంతో సినిమా ఒప్పుకున్నాడు. దానికి నేను ఈరోజుకి ఏడిపిస్తూ ఉంటాను నువ్వు నాన్నగారి కోసం సినిమా చేసావు కానీ నా కోసం చేయలేదు అని అంతే కదా బావ కోసమే కదా చేయాలి అని ప్రభాస్ అంటూ ఉంటాడు. తన గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక్కడ వచ్చిన ప్రభాస్ అభిమానులు అందరికీ ఒకటే చెబుతున్నాను. మీరందరూ అతని స్టార్ డం చూసి అభిమానులు అయ్యారేమో కానీ అతని వ్యక్తిత్వం అతని మంచితనం నాకు చాలా ఇష్టం. అతన్ని చూసి ఈ తరం చాలా నేర్చుకోవాలి.

Also Read:Ghaati : ‘ఘాటీ’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..

కొంత డబ్బు వచ్చినా కొంత పేరు వచ్చిన ఈరోజున మనుషులు మారిపోతున్నారు. కానీ ఆ వ్యక్తి ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్. కానీ మేమిద్దరం మొదటి రోజు ఎలా కలిశామో ఈరోజుకి అలాగే ఉన్నాం. సో ప్రభాస్ ఇది నువ్వు చూస్తున్నావు ఇది నీకు చెప్తున్నాను. నా జీవితంలో నువ్వు కృష్ణుడివి కానీ నీ జీవితంలో నేను కర్ణుడిని. నీకేం కావాల్సి వచ్చినా ఎప్పుడు నీ వెనకే ఉంటాను నువ్వు ఏమైనా చెయ్ నేను నీకోసం ఎప్పుడూ నిలబడతాను బ్రదర్. నువ్వు చేసిన సాయానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

​కన్నప్ప సినిమా ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్లో మంచు విష్ణు, ప్రభాస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి స్నేహితులు రెండు రకాలు ఉంటారని ఒకరు కర్ణుడులా ఉంటే మరొకరు కృష్ణుడులా ఉంటారని చెప్పుకొచ్చారు. కృష్ణుడు నీ పక్కనే ఉంటూ నీకు దారి చూపిస్తూ నీ వెంటే ఉంటాను అంటాడు. కర్ణుడు నువ్వు ఏమన్నా చెయ్ ఏదైనా నేను చూసుకుంటా అంటాడు. నా జీవితంలో కృష్ణుడిగా ప్రభాస్ ఉన్నాడు. Also Read:Kannappa: కన్నప్ప మీద  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *