Minister Nara Lokesh: “ఇంటింటికీ టీడీపీ”.. ప్రజాప్రతినిధులకు నారా లోకేష్ కీలక ఆదేశాలు..

Follow

సీనియర్లు పార్టీకి కాపలా కాశారని.. సీనియర్ల సహకారం పార్టీకి అవసరమని మంత్రి నారాలోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి లోకేశ్ ప్రసంగించారు. ఎన్నికల్లో గెలుపు వెనుక కార్యకర్తల కష్టం ఉందని గుర్తు చేశారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కష్టపడాలన్నారు. మంచి పనులు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేశారు. 151 సీట్లు 11 అయ్యాయంటే దానికి కారణం వారి అహంకారమని విమర్శించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తల్లికి వందనం అమలుచేశామని గుర్తు చేశారు. పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. దేశం మొత్తం తిరిగినా, ప్రపంచం మొత్తం తిరిగినా తిరిగి వచ్చేది మనం పవిత్ర దేవాలయంలా భావించే పార్టీ కార్యాలయానికే అన్నారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడిచేస్తే పట్టించుకోని పరిస్థితి ఆనాటి పాలనలో చూశామన్నారు.
READ MORE: Amit Shah: పాకిస్థాన్ మాట రాహుల్‌గాంధీ నోట వినబడుతోంది.. అమిత్ షా ఆగ్రహం..
కష్టపడిన కార్యకర్తలను మరువద్దని మిమ్మల్నందరినీ కోరుతున్నట్లు మంత్రి నారాలోకేష్ తెలిపారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలని.. మనం ఎక్కడ కూర్చోవాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. పార్టీ వ్యవస్థలో మహిళలను పెద్దఎత్తున భాగస్వాములను చేస్తామని స్పష్టం చేశారు. అనుబంధ విభాగాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని.. జులై 5 నాటికి కమిటీలన్నింటిని పూర్తిచేయాలని సూచించారు. సీనియర్లకు ఉన్న అనుభవం, యువతకు ఉన్న శక్తి రెండింటినీ జోడించాల్సిన అవసరం ఉందని తెలిపారు.. సీనియర్లే నాలుగు దశాబ్దాలు పార్టీని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు.. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. నెల రోజుల పాటు తూచా తప్పకుండా అందరం డోర్ టూ డోర్ ప్రచారం చేసి సుపరిపాలనలో తొలి అడుగు పడిందని.. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.
READ MORE: Crime: 18 ఎకరాల కోసం పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే భర్తను చంపిన భార్య..
Minister Nara Lokesh Emphasizes Senior Leaders’ Role and Grassroots Strengthening in TDP Revival Strategy
సీనియర్లు పార్టీకి కాపలా కాశారని.. సీనియర్ల సహకారం పార్టీకి అవసరమని మంత్రి నారాలోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి లోకేశ్ ప్రసంగించారు. ఎన్నికల్లో గెలుపు వెనుక కార్యకర్తల కష్టం ఉందని గుర్తు చేశారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కష్టపడాలన్నారు. మంచి పనులు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేశారు. 151 సీట్లు 11 అయ్యాయంటే దానికి కారణం వారి అహంకారమని విమర్శించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా