MLA Bandari Lakshma Reddy | బండారి రాజిరెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Mla Bandari Lakshma Reddy

MLA Bandari Lakshma Reddy | చర్లపల్లి, జూన్‌ 22 : నిబద్ధత కలిగిన నాయకుడు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బండారి రాజిరెడ్డిని కొల్పోవడం బాధకరమని ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్‌ పరిధిలోని కుషాయిగూడ కృష్ణారెడ్డినగర్‌, బంజార కాలనీలో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ బండారి రాజరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఉప్పల్‌ నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బండారి రాజిరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. రాజిరెడ్డి బాటలో నడుస్తూ ఉప్పల్‌ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు.

కాలనీలో నెలకొన్న సమస్యలను దశలవారిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు నేమూరి మహేశ్‌గౌడ్‌, డప్పు గిరిబాబు, పద్మారెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Read Also :

Peddagattu | జీఓ ఇచ్చారు.. నిధులు మరిచారు.. కాంగ్రెస్‌ హయాంలో లింగమంతుల స్వామికి శఠగోపమేనా?

Bigg Boss 9 | బిగ్ బాస్ సంద‌డికి టైం ఫిక్స్ అయిన‌ట్టేనా.. కంటెస్టెంట్స్ ఎవ‌రెవ‌రంటే..!

Road Accident | వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి..

​MLA Bandari Lakshma Reddy | ఉప్పల్‌ నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బండారి రాజిరెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సూచించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *