MLA Sabitha | సీఎం రేవంత్ సంక్షేమాన్ని గాలికి వదిలేశారు.. ఎమ్మెల్యే సబిత ఫైర్

Follow

MLA Sabitha | బడంగ్‌పేట్, జూన్ 29 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా సంక్షేమం కన్నా రాజకీయం ముఖ్యమై పోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇందిరా రెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ గ్రీన్ రిచ్ కాలనీలో ఆదివారం ఎమ్మెల్యే పర్యటించారు. కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. కాలనీ వాసులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. కాలనీలో ఇప్పటివరకు జరిగిన పనులను, ఇంకా జరగవలసిన పనులను పర్యవేక్షించారు. కాలనీలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులు అంత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చొరవతోనే గ్రీన్ రిచ్ కాలనీలో ఉన్న సమస్యలు పరిష్కరించడం జరిగిందని కాలనీవాసులు కొనియాడారు. ముంపు సమస్యను, రోడ్ల సమస్యలు సబితా ఇంద్రారెడ్డి ద్వారానే పరిష్కరించబడ్డాయని కాలనీవాసులు ఘంటాపరంగా చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెండింగ్ పనుల ను తక్షణమే పూర్తి చేసి కాలనీవాసులకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్లకు ఆమె సూచనలు చేశారు. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని ఆమె సూచించారు. ఒక కాలనీ ప్రగతిశీలంగా ఎదగాలంటే తగిన ప్రణాళిక అవసరం అన్నారు. అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రణాళిక అంటూ లేదన్నారు. పాలన వ్యవస్థ అంత కుంటుపడిందన్నారు. అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రజా సమస్యల పరిష్కారం ప్రశ్నార్ధకంగా మారిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా అభివృద్ధి చేయవలసిన పాలకవర్గం పనిచేస్తామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధిపై దృష్టి సాధించాలి తప్ప రాజకీయాలపై దృష్టి సారించడం కాదన్నారు. రాష్ట్ర అభివృద్ధికీ వ్యూహాత్మక విధానాలు కీలకం అని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి ప్లానింగ్ అనేది లేదన్నారు.ఇష్టం వచ్చినట్లు పరిపాలన సాగుతోందన్నారు. ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ కాండవ కప్పుకున్న వాళ్లకేనా? ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారికే వర్తిస్తోందా? అర్హులైన పేదలను ఎందుకు విస్మరిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
అధికారులు అధికారికంగా పని చేయకుండా రాజకీయ నేతల మాటలు విని విధులు నిర్వహిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. అధికార నేతల మాటలు వింటేనే ఈ ప్రాంతంలో పనిచేయవలసిన దుస్థితి వచ్చిందన్నారు. అధికారులను నిత్యం వేధిస్తున్నట్లు సమాచారం వస్తుందన్నారు. నిజమైన లబ్ధిదారుల జాబితాలు పక్కన పడేసి అధికార పార్టీ నేతలకు అధికారులు కొమ్ముకాస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రజా పాలన అంటే కాంగ్రెస్ నాయకులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చుడేనా అని ఆమె ప్రశ్నించారు. పేద ప్రజలను విస్మరించి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు కాంగ్రెస్ కార్డు ఒక కప్పుకున్న వాళ్లకు ఇవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. అధికారులలో మార్పు రాకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె పరోక్షంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సుర్ణకంటి అర్జున్, పెద్దబావి ఆనంద్ రెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి, బోయపల్లి శేఖర్ రెడ్డి, పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రాజ్, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.
MLA Sabitha | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా సంక్షేమం కన్నా రాజకీయం ముఖ్యమై పోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇందిరా రెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ గ్రీన్ రిచ్ కాలనీలో ఆదివారం ఎమ్మెల్యే పర్యటించారు.