MLA Vijaya Ramana Rao | సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు

Follow

సుల్తానాబాద్ రూరల్ జూలై 1: సంక్షేమం దిశగా ప్రభుత్వం పని చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నరసయ్య పల్లి గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే విజయరమణారావు పర్యటించారు. పెద్దమ్మతల్లి ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి, సిసి రోడ్లులకు భూమి పూజ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మంజూరు పత్రాలు అందజేసి, ముగ్గురు పోశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాల ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళా సంఘం భవనానికి రూ.10 లక్షల వరకు, పెద్దమ్మతల్లి ఆలయ ఆవరణలోని ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.5 లక్షలను మంజూరు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతట అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, గర్రెపల్లి సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు, తాసిల్దార్ బషీరుద్దీన్, ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, నాయకులు జూపల్లి తిరుమలరావు, సాయి మహేందర్, పన్నాల రాములు, దామోదర్ రావు, సతీష్ , జానీ, సత్యనారాయణ రావు, బల్మూరి వెంకటరమణారావు, గ్రామస్తులు తదితరులున్నారు.
సంక్షేమం దిశగా ప్రభుత్వం పని చేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రామారావు అన్నారు.