MLC 2025 : డుప్లెసిస్ విధ్వంసకర శతకం.. ముంబై పై సూపర్ కింగ్స్ విజయం..

Follow

మేజర్ లీగ్ క్రికెట్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ దూసుకుపోతుంది. ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ముంబై ఇండియన్స్ న్యూయార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ 39 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (103; 53 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టానికి 223 పరుగులు సాధించింది. డోనోవన్ ఫెర్రీరా (53; 20 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. ముంబై బౌలర్లలో రుషిల్ ఉగార్కర్, జార్జ్ లిండే చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ZIM vs SA : చరిత్ర సృష్టించిన కేశవ్ మహారాజ్.. దక్షిణాఫ్రికా స్పిన్నర్లలో ఒకే ఒక్కడు..
You brought the whistles, we brought the 𝐐!
#TSKvMINY#WhistleForSuperKings#MLC2025 pic.twitter.com/vYe4AjH7KA
— Texas Super Kings (@TexasSuperKings) June 30, 2025
అనంతరం 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 184 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో కీరన్ పొలార్డ్ (70; 39 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. క్వింటన్ డికాక్ (35; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పర్వాలేదనిపించగా కెప్టెన్ నికోలస్ పూరన్ (7 బంతుల్లో 8 పరుగులు) ఘోరంగా విఫలం అయ్యాడు. కింగ్స్ బౌలర్లలో అకేల్ హోసిన్ మూడు వికెట్లు తీయగా, నాంద్రే బర్గర్, మార్కస్ స్టాయినిస్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
మేజర్ లీగ్ క్రికెట్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ దూసుకుపోతుంది.