MLC Vital | ఉపాధ్యాయుడిగా శ్రీరాములు సేవలు ప్రశంసనీయం..!

Follow

తాండూర్, జూన్ 29: ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తే మంచి గుర్తింపు లభిస్తుందని, ఉపాధ్యాయులు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి విరమణ పొందడంలో మానసిక ఆనందం ఉంటుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన మాసాడి శ్రీరాములు (Masadi Sriramulu)కు ఆదివారం మండల కేంద్రంలోని సురభి గోదాక్షేత్ర ఫంక్షన్ హాల్‌లో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‌కు బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య, ఎస్సీ, ఎస్టీ తెలంగాణ రాష్ట్ర కమిషన్ సభ్యుడు రేనికుంట్ల ప్రవీణ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
సమాజానికి భాషా, సాంస్కృతి, క్రమశిక్షణ, నడవడిక నేర్పించేది ఉపాధ్యాయులేనని వారు తెలిపారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిరుచులను అలవాట్లను క్రమశిక్షణను అనుకరిస్తారని అన్నారు.
ఉపాధ్యాయులు తమ ఉద్యోగ బాధ్యతలు నిబద్ధతతో నిర్వర్తించినట్లయితే సభ్య సమాజానికి నిర్మాణ కర్తలవుతారని ఎమ్మెల్సీ, ఎమ్మెల్లే అన్నారు.
ఉపాధ్యాయునిగా, సంఘ నాయకునిగా శ్రీరాములు చేసిన కృషిని వారిద్దరు అభినందించారు. సుమారు 39 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన శ్రీరాములు ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలబెట్టడం ఎంతో సంతోషకరమని వాళ్లు ఈ సందర్భంగా అన్నారు.

విద్యాబోధనకే పరిమితం కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన ఈ మండలంలో ఆదర్శ ఉపాధ్యాయుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించారు. సతీమణి శ్రీదేవి ప్రజలకు రాజకీయ సేవ చేసేందుకు శ్రీరాములు సహకరించారని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తెలిపారు. తాండూర్ మండల ఎంపీపీగా, బుగ్గ ఆలయ కమిటీ చైర్మన్‌గా, బోయపల్లి ఎంపీటీసీగా శ్రీదేవి ప్రజలకు సేవ చేశారని వాళ్లు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు, స్నేహితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరాములు, శ్రీదేవి దంపతులను పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఇవో లు ఎస్ మల్లేశం, వాసాల ప్రభాకర్, ఉపాధ్యాయులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
- Manchala | డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు సామూహిక గృహప్రవేశం
- Asia Cup | హైబ్రిడ్ మోడల్లో ఆసియాకప్.. జూలైలో షెడ్యూల్..!
- గబ్బర్‌సింగ్ బ్యాచ్ విలన్ మృతి
- Ramavaram : అధికారుల నిర్లక్ష్యంతో స్కాలర్‌షిప్స్‌కు మైనారిటీ విద్యార్థులు దూరం
తాండూర్, జూన్ 29: ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తే మంచి గుర్తింపు లభిస్తుందని, ఉపాధ్యాయులు తమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి విరమణ పొందడంలో మానసిక ఆనందం ఉంటుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు.