Moeen Ali : భారత్‌తో రెండో టెస్టు.. గెలిచేందుకు ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్.. జట్టులో చేరిన మొయిన్ అలీ..

Follow

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 2 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్ అదే జోష్‌ను కొనసాగించాలని చూస్తుండగా.. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని టీమ్ఇండియా పట్టుదలగా ఉంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
మాజీ ఆల్‌రౌండర్ మోయిన్ అలీని కోచింగ్ కన్సల్టెంట్‌గా నియమించింది. సోమవారమే అతడు ఇంగ్లాండ్ జట్టుతో కలిశాడని ది టెలిగ్రాఫ్ తెలిపింది. ఇంగ్లాండ్ తుది జట్టులో షోయబ్ బషీర్ ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఉన్నాడు. అతడు తొలి టెస్టులో విఫలం అయ్యాడు. ఈ నేపథ్యంలో అతడికి సాయం చేసేందుకు అలీని కన్సల్టెంట్‌గా నియమించినట్లు తెలుస్తోంది.
Shreyas Iyer : అమ్మచేతిలో శ్రేయస్ అయ్యర్ క్లీన్ బౌల్డ్.. నెట్టింట మీమ్స్ వైరల్..
అదే విధంగా భారత జట్టులో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా వంటి స్పిన్నర్లు ఉన్న నేపథ్యంలో వారిని ఎలా ఎదుర్కొవాలనే దానిపై అలీ ఇంగ్లీష్ బ్యాటర్లు సలహాలు ఇవ్వనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ స్పినర్లు అనుకూలం అని సమాచారం.
ఇక భారత జట్టు రెండో టెస్టులో కొన్ని మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. కోచ్ ర్యాన్ టెన్ డోస్పేట్ ప్రకారం.. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి ఆడొచ్చు. ఇక కుల్దీప్ యాదవ్ సైతం తుది జట్టులో ఉండొచ్చు. బుమ్రాకు విశ్రాంతి ఇస్తే ఆకాశ్ దీప్ తుది జట్టులోకి రావొచ్చు.
Kavya Maran : ఎట్టకేలకు మౌనం వీడిన కావ్య మారన్.. ఐపీఎల్‌లో తన మీమ్స్ , రియాక్షన్స్ గురించి..
ఇదిలా ఉంటే.. మ్యాచ్‌కు 48 గంటల ముందుగానే ఇంగ్లాండ్ తమ తుది జట్టును ప్రకటించింది. తొలి టెస్టులో ఆడిన జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.
రెండో టెస్ట్ కోసం ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 2 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.