Mosquitoes: వర్షాకాలం దోమలతో ఇబ్బందా.. ఇలా చేయండి.. ఒక్క దోమ కూడా ఇంట్లోకి రాదు

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Home tips to get rid of mosquito problem

వర్షాకాలం వచ్చింది అంటే దోమల బెడద మొదలవుతుంది. అవి రావడమే కాదు వస్తూ వస్తూ ప్రమాదకరమైన రోగాలను వెంటపెట్టుకొని వస్తాయి. అందుకే, వర్షాకాలం రాగానే దోమల నివారణ కోసం చర్యలు చేపడతారు. ఇంట్లో కూడా దోమల కోసం ప్రత్యేకంగా దోమ తెరలు, మస్కిటో కొయిల్స్, గుడ్ నైట్, ఆల్ అవుట్ లాంటి ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. కానీ, అలాంటివి వాడటం వల్ల, వాటి వాసనా పీల్చుకోవడం వల్ల మనిషి ఆరోగ్యానికి ప్రమాదం అని నిపుణులు చెప్తున్నారు. అయితే, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల దోమలను ఇంట్లో రాకుండా నివారించవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని రకాల మొక్కలను పెంచడం వల్ల కూడా దోమ‌ల‌ను తరిమికొట్టవచ్చు. సిట్రొనెల్లా గ్రాస్ అనే గ‌డ్డిని ఇంట్లో పెంచాలి. ఈ గడ్డిలో మ‌స్కిటో రీపెల్లెంట్ గుణాలు ఉన్నాయి. దీని వాస‌న దోమ‌ల‌కు ఇరిటేషన్ తెప్పిస్తుంది. కాబట్టి లోపలికి రాలేవు. ఇంకా లావెండ‌ర్ మొక్క‌ ఇంట్లో ఉన్నా కూడా దోమ‌ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఈ మొక్క యొక్క వాస‌న కూడా దోమ‌ల‌కు నచ్చదు. ఇంకా తుల‌సి, బంతి పూల మొక్క‌లు వెదజ‌ల్లే వాస‌న సైతం దోమ‌ల‌ను తరిమికొడతాయి.

ఇంటి పరిసరాల్లో చెత్త‌ను కూడా శుభ్రం చేసుకోవాలి. దోమ‌ల‌ను నివారణకు యూక‌లిప్ట‌స్ ఆయిల్ అద్భుతంగా ప‌నిచేస్తుంది. ఈ ఆయిల్ ని నీళ్ల‌తో కలిపి దోమ‌లు ఉన్న చోట స్ప్రే చేస్తే దోమలు నశిస్తాయి. సిట్రొనెల్లా ఆయిల్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని కూడా అలాగే స్ప్రే చేస్తే దోమలు నశిస్తాయి. ఇంకా వేప నూనె, ఎసెన్షియ‌ల్ ఆయిల్స్, లావెండ‌ర్ ఆయిల్‌, టీ ట్రీ ఆయిల్‌, క్లోవ్ ఆయిల్‌, సినామ‌న్, పెప్ప‌ర్ మింట్ ఆయిల్‌, సోయాబీన్ ఆయిల్‌ ఇలా చాలా రకాల ఆయిల్స్ దోమల నివారణ కోసం వాడవచ్చు.

దోమలు ఇంట్లోకి రాకుండా చేయాలంటే ముందుగా వాటి సంతతి పెరగకుండా ఆపాలి. దానికి సంబంధించి నివారణ చర్యలు తీసుకోవాలి. అందులో మొదటిది మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చుట్టూ పక్కలా ఎలాంటి నీటి మడుగులు, నీటి నిల్వలు, మురుగు నీరు ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటె దోమలు నీటి నిల్వలపైననే ఎక్కువగా తమ సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. కాబట్టి, ఇంటి చుట్టుపక్కల ఎలాంటి నీటి మడుగులు లేకుండా శుభ్రం చేసుకోవాలి.

​Mosquitoes: కొన్ని రకాల మొక్కలను పెంచడం వల్ల కూడా దోమ‌ల‌ను తరిమికొట్టవచ్చు. సిట్రొనెల్లా గ్రాస్ అనే గ‌డ్డిని ఇంట్లో పెంచాలి. ఈ గడ్డిలో మ‌స్కిటో రీపెల్లెంట్ గుణాలు ఉన్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *