MP: చదువు విషయంలో స్నేహితురాళ్ల మధ్య మనస్పర్థలు.. చైల్డ్‌ఫ్రెండ్‌పై యాసిడ్‌తో దాడి

Follow

వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు. అంతేకాకుండా సమీపంలోని ఇరుగుపొరుగు నివాసాలు. ఇక చదువులో ఒకరి కంటే మరొకరు ఎక్కువగా చదువుతున్నారు. అదే మరొకరికి పగ రగిలించింది. స్నేహితురాలిపై అసూయ పెంచుకుంది. ఏదొకటి చేయాలని కుట్ర పన్నింది. అంతే స్నేహం ముసుగులో బయటకు పిలిచి యాసిడ్ పోసింది. దీంతో ఒక్కసారిగా నొప్పితో విలవిలలాడిపోయింది. ప్రస్తుతం తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో జరిగింది.
ఇది కూాడా చదవండి: Air India Plane Crash: ఎయిర్ ఇండియా, బోయింగ్‌పై యూకే కుటుంబాల న్యాయ పోరాటం..!
శ్రద్ధా దాస్, ఇషితా సాహు ఇద్దరూ బాల్య స్నేహితులు. ఇక శ్రద్ధా దాస్ బీబీఏ చదువుతోంది. ఇషితా సాహు చదువులో వెనకబడింది. అయితే నెల రోజుల నుంచి ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. అయితే ఉన్నట్టుండి ఆదివారం రాత్రి ఇషితా సాహు.. శ్రద్ధా దాస్ ఇంటికి వచ్చింది. పరీక్షల కోసం శ్రద్ధా దాస్ చదువుకుంటోంది. బయటకు రావాలని అడిగితే ఎట్టకేలకు అంగీకరించింది. ఇద్దరూ ఇంటి బయట కొన్ని నిమిషాలు మాట్లాడుకున్నారు. ఇక చదువుకోవాలన్న ఉద్దేశంతో శ్రద్ధా ఇంట్లోకి వెళ్లబోతుండగా హఠాత్తుగా ఇషితా యాసిడ్ బాటిల్ తీసుకుని ముఖంపై పోసింది. ఒక్కసారిగా శ్రద్ధా శరీరమంతా కాలిపోయింది. బాధ తట్టుకోలేక విలవిలలాడిపోయింది. నొప్పి భరించలేక కేకలు వేసింది. వెంటనే స్థానికులు శ్రద్ధాను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతోంది. అయితే పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
ఇది కూాడా చదవండి: Kavya Maran: అందుకే నాపై మీమ్స్.. అసలు విషయం చెప్పేసిన కావ్య మారన్!
సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. విద్య విషయంలో వెనుకబడి ఉండడంతోనే ఇషితా అసూయ పెంచుకుందని.. ఆ కారణంతోనే శ్రద్ధాపై యాసిడ్ దాడి చేసిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. న్యూనతా భావంతోనే ఇషితా క్రూరంగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యురాలిగా భావించిన వ్యక్తే.. ఇలాంటి ద్రోహం చేయడంపై శ్రద్ధా తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితురాలు ఇషితా సాహును పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
వారిద్దరూ చిన్ననాటి స్నేహితులు. అంతేకాకుండా సమీపంలోని ఇరుగుపొరుగు నివాసాలు. ఇక చదువులో ఒకరి కంటే మరొకరు ఎక్కువగా చదువుతున్నారు. అదే మరొకరికి పగ రగిలించింది. స్నేహితురాలిపై అసూయ పెంచుకుంది.