Mt Elbrus: మౌంట్ ఎల్‌బ్రుస్ ఎక్కిన ఆరేళ్ల పంజాబీ బాలుడు

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Teghbirsingh

న్యూఢిల్లీ: పంజాబ్‌లోని రోప‌ర్‌కు చెందిన ఆరేళ్ల బాలుడు తెగ్‌బీర్ సింగ్‌.. ర‌ష్యాలో అతిపెద్ద శిఖ‌రం మౌంట్ ఎల్‌బ్రుస్‌(Mt Elbrus)ను అధిరోహించాడు. ఆ ప‌ర్వ‌తం సుమారు 5642 మీట‌ర్ల ఎత్తు ఉంది. జూన్ 20వ తేదీన అత‌ను ట్రెక్కింగ్ ప్రారంభించాడు. జూన్ 28వ తేదీ అత‌ను ఎల్‌బ్రుస్ శిఖ‌రానికి చేరుకున్నాడు. మౌంట్ ఎల్‌బ్రుస్ ఎక్కిన అత్యంత పిన్న వ‌య‌స్కుడిగా తెగ్‌బీర్ సింగ్ రికార్డు సృష్టించాడు. ర‌ష్యాలోని బాల్కేరియ‌న్ రిప‌బ్లిక్ ప్రాంతంలో ఉన్న మౌంటెనీరింగ్‌, రాక్ క్లైంబింగ్‌, స్పోర్ట్స్ టూరిజం స‌మాఖ్య ఆ బాలుడికి స‌ర్టిఫికేట్ అంద‌జేసింది. ఇండియాకు చెందిన అతిపిన్న వ‌య‌స్కుడు.. ఆరేళ్ల 9 నెల‌ల 4 రోజులు ఉన్న తెగ్‌బీర్ ఎల్‌బ్రుస్ ప‌ర్వ‌తాన్ని అధిరోహించినట్లు ఆ స‌ర్టిఫికేట్‌లో పేర్కొన్నారు. పంజాబ్‌లోని రూప్‌న‌గ‌ర్‌లో ఉన్న శివాలిక్ ప‌బ్లిక్ స్కూల్‌లో అత‌ను రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. 2024లో ఆఫ్రికాలోని అతిపెద్ద శిఖ‌రం మౌంట్ కిలిమంజారోను ఎక్కాడు. గ‌త ఏడాది ఏప్రిల్‌లోనే ఆ బాలుడు నేపాల్‌లోని మౌంట్ ఎవ‌రెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్నాడు.

​Mt Elbrus: ఆరేళ్ల తెగ్‌బీర్ సింగ్‌ ర‌ష్యాలో అతిపెద్ద శిఖ‌రం మౌంట్ ఎల్‌బ్రుస్‌ను అధిరోహించాడు. ఆ ప‌ర్వ‌తం సుమారు 5642 మీట‌ర్ల ఎత్తు ఉంది. జూన్ 20వ తేదీన ట్రెక్కింగ్ ప్రారంభించి.. జూన్ 28వ తేదీ ఎల్‌బ్రుస్ శిఖ‌రానికి చేరుకున్నాడు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *