Nalgonda : పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో శైలజా రామయ్యర్ పూజలు

Follow

రామగిరి, జూన్ 30 : ఎంతో చరిత్ర కలిగిన పానగల్ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయ ప్రాముఖ్యతను భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ, చేనేత, జౌలి శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ అన్నారు. సోమవారం ఆమె నల్లగొండ సమీపంలోని పానగల్‌లో ఉన్న ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవాలయ చరిత్రను తెలుసుకున్న ఆమె దేవాలయ ప్రాముఖ్యతను, అదేవిధంగా శిల్ప విశిష్టత, చరిత్ర అన్నింటిని భద్రపరిచేలా చూడాలని ఆర్కిటెక్చర్ సూర్యనారాయణమూర్తి, అలాగే ధార్మిక పరిషత్ సలహాదారు గోవింద హళ్లితో అన్నారు. ఆలయ అర్చకులు ప్రిన్సిపల్ సెక్రటరీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. విశేష పూజల అనంతరం వేద ఆశీర్వచనం అందించారు. ఆమె వెంట జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి ఉన్నారు.

Nalgonda : పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో శైలజా రామయ్యర్ పూజలు
ఎంతో చరిత్ర కలిగిన పానగల్ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయ ప్రాముఖ్యతను భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ, చేనేత, జౌలి శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ అన్నారు.