Namo Bharat | నమో భారత్ ర్యాపిడ్ రైళ్ల ట్రయల్ రన్ విజయవంతం..! గంటలోనే 82 కిలోమీటర్లు దూసుకెళ్లిన రైలు..!
Follow

Namo Bharat | ఢిల్లీ సరాయ్-మోదీపూర్ మధ్య నమో భారత్ ర్యాపిడ్ రైళ్ల ట్రయల్ రన్ తొలిసారి విజయవంతంగా నిర్వహించారు. 82 కిలోమీటర్ల మార్గాన్ని రైలు గంటలోనే పూర్తి చేసింది. ట్రయల్ రన్ సమయంలో మీరట్ మెట్రో సైతం నమో భారత్ రైళ్లతోపాటు నడిచాయి. మీరట్‌లో శతాబ్దినగర్ నుంచి మోదీపురం వరకు రెండు నమో భారత్, మెట్రో రైళ్లతో ట్రయల్ రన్ కొనసాగుతున్నది. ట్రయల్ రన్ సమయంలో నమో భారత్ రైళ్లు మొత్తం 82 కిలోమీటర్ల దూరాన్ని 160 కిలోమీటర్ల వేగంతో నడిచాయి. సరాయ్ కాలే ఖాన్ నుంచి మోదీపురం మధ్యనున్న ప్రతి స్టేషన్‌లోనూ రైలు ఆగాయి. ఎన్‌సీఆర్‌టీసీ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం.. గంట కంటే తక్కువ సమయంలోనే సరాయ్ నుంచి మోదీపురం చేరుకుంది.
ఈ విజయం ఢిల్లీ, ఘజియాబాద్, మీరట్‌లను కలిపే భారత తొలి నమో భారత్ కారిడారన్‌లో కీలమైన మైలురాయని నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలి ఎల్‌ఈటీ బ్యాక్‌బోన్‌పై పనిచేసే ఈ అధునాత ఈటీసీఎస్ లెవెల్-3 హైబ్రిడ్ సిగ్నలింగ్ వ్యవస్థ, ప్రతి స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫారం స్క్రీన్ డోర్స్ సైతం ట్రయల్ రన్ సమయంలో ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతంగా పని చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కారిడార్‌లోని 55 కిలోమీటర్ల మార్గంలో 11 స్టేషన్లతో ప్రయాణికులకు అందుబాటులో ఉండగా.. ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్-న్యూ అశోక్ నగర్ మధ్య 4.5 కిలోమీటర్లు, మీరట్‌లోని మీరట్ సౌత్-మోదీపురం మధ్య సుమారు 23 కిలోమీటర్ల రూట్‌లో ట్రయల్ రన్‌తో పాటు తుదిదశ పనులు కొనసాగుతున్నాయి. దేశంలోనే తొలిసారిగా నమో భారత్ రైళ్ల కోసం ఉపయోగించే మౌలిక సదుపాయాలపైనే స్థానిక మెట్రో సేవలు అందిస్తుండడం విశేషం. మీరట్ సౌత్- మోదీపురం డిపో మధ్య మీరట్ మెట్రో ట్రయల్ రన్ కొనసాగుతున్నాయి.
Namo Bharat | ఢిల్లీ సరాయ్-మోదీపూర్ మధ్య నమో భారత్ ర్యాపిడ్ రైళ్ల ట్రయల్ రన్ తొలిసారి విజయవంతంగా నిర్వహించారు. 82 కిలోమీటర్ల మార్గాన్ని రైలు గంటలోనే పూర్తి చేసింది. ట్రయల్ రన్ సమయంలో మీరట్ మెట్రో సైతం నమో భారత్ రైళ్లతోపాటు నడిచాయి.