Niharika: నిహారిక రెండో పెళ్లి చేసుకుంటుందా? నాగబాబు సమాధానమిదే

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Niharika: నిహారిక రెండో పెళ్లి చేసుకుంటుందా? నాగబాబు సమాధానమిదే

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని విజయాలను ఖాతాలో వేసుకుంది. నిర్మాతగానూ కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మించి సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా గతేడాది నిహారిక నిర్మించిన మొదటి సినిమా కమిటీ కుర్రోళ్లు సూపర్ హిట్ అయ్యింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసిన గద్దర్ అవార్డుల్లోనూ ఈ సినిమాకు పురస్కారాలు వచ్చాయి. అయితే ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస అయిన నిహారిక పర్సనల్ లైఫ్ లో మాత్రం ఒడిదొడుకులు ఎదుర్కొంది. ముఖ్యంగా తన పెళ్లి విషయంలో .. 2020లో జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది మెగా డాటర్. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కానీ వీరి కాపురం ముణ్ణాళ్ల ముచ్చటే అయింది. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో 2023లో పరస్పర అంగీకారంతో నిహారిక- చైతన్య విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటినుంచి నిహారిక సింగిల్ గానే ఉంటోంది. అప్పుడప్పుడూ ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలపై నిహారిక తండ్రి నాగబాబు స్పందించారు.

నిహారిక, నేను అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుకుంటాం. అలా అనీ నేను పిల్లల కెరీర్‌ విషయాల్లో తలదూర్చను. నా పిల్లల హిట్స్‌, ఫ్లాప్‌ గురించి నాకవసరం లేదు. వాళ్లు సంతోషంగా ఉన్నారా? లేదా? అన్నదే ముఖ్యం. వాళ్లు ఆనందంగా లేకపోతే ఎన్ని కోట్లున్నా వృథానే! వరుణ్‌.. లావణ్యను పెళ్లి చేసుకుంటానని నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు.. ఆమెతో నువ్వు హ్యాపీగా ఉంటావా? భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావు కదా? అన్నాను. లేదు, హ్యాపీగా ఉంటాం అని అన్నాను. సరేనని పెళ్లి జరిపించాం. వాడి జడ్జిమెంట్‌ కరెక్ట్‌ అయింది. ఇప్పుడు వారిద్దరూ సంతోషంగా ఉన్నారు’

నిహారిక లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

‘ కానీ నిహారిక పెళ్లి విషయంలో నా జడ్జిమెంట్‌ రాంగ్ అయ్యింది. అలా అని తనకు ఇష్టం లేని పెళ్లి జరిపించలేదు. తను సంబంధం ఓకే అన్నాకే ముందుకు వెళ్లాం. కానీ.. తనకు, అబ్బాయికి సింక్‌ అవ్వలేదు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇప్పుడిప్పుడే నిహారిక ఇందులో నుంచి తేరుకుంటోంది. కానీ ఏదో ఒక రోజు నిహారిక వేరే.. అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందనుకుంటున్నాను. వారి విషయాలలో ఇన్వాల్వ్ కావాలని అనుకోవడం లేదు. పిల్లలకు నచ్చినట్లుగా జీవించాలని కోరుకుంటాను’ అని చెప్పుకొచ్చారు నాగబాబు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

​మెగా డాటర్, హీరోయిన్ నిహారిక కొణిదెల వైవాహిక బంధం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 2000లో జొన్నలగడ్డ చైతన్యతో కలిసి పెళ్లిపీటలెక్కింది నిహారిక. అయితే మూడేళ్లకే వీరి బంధం బీటలు వారింది. 2023లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుని విడిపోయారు నిహారిక- చైతన్య. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *