Nithiin: అభిమానులకు క్షమాపణలు చెప్పిన నితిన్.. ఇక పై అలా చేయను అంటూ ఎమోషనల్ కామెంట్స్

Follow

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు అర్జెంట్ గా హిట్ కావాలి.. అప్పుడెప్పుడో వచ్చిన భీష్మ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు నితిన్. మధ్యలో రంగ్ దే సినిమా చేసినప్పటికీ ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమా దారుణంగా నిరాశపరిచింది. దాంతో ఇప్పుడు ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఇటీవల నితిన్ తనకు భీష్మ సినిమాలాంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు డైరెక్షన్ లో ఓ సినిమా చేశాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. రాబిన్ హుడ్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోయింది. ఇక ఇప్పుడు తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ఎందుకు రానున్నాడు.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, లయ కీలకపాత్రల్లో నటిస్తున్నాడు. ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నితిన్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నితిన్ మాట్లాడుతూ.. ఇక పై మంచి సినిమాలు మాత్రమే చేస్తా అని ప్రామిస్ చేశారు.
నితిన్ మాట్లాడుతూ.. ఈ సినిమా ముగ్గురి కోసం హిట్ అవ్వాలని కోరుకుంటున్నా.. దర్శకుడు వేణు శ్రీ రామ్.. తమ్ముడు సినిమా కోసం దాదాపు మూడేళ్లు కష్టపడ్డాడు. నన్ను ఇష్టపడే వాళ్ల కోసం ఈ సినిమా హిట్ అవ్వాలి, నన్ను అభిమానించే వాళ్ళ కోసం ఈ సినిమా హిట్ అవ్వాలని .. నాకు హిట్ వస్తే ఆనందపడే వాళ్లు.. ఫ్లాప్ వస్తే భాదపడేవాళ్ళ కోసం ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా.. నేను ఈ మధ్య చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.. దానికి మీ అందరినీ క్షమాపణలు కోరుతున్నాను. ఇక పై మంచి సినిమాలు చేస్తానని ప్రామిస్ చేస్తున్నా.. తమ్ముడు సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని అనుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు నితిన్. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
యంగ్ హీరో నితిన్ ఇటీవల చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోయాయి. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ యంగ్ హీరో హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు తమ్ముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నితిన్. ఈ సినిమాతో లయ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.