Nithin | బన్నీ అంత నువ్వు ఎదగలేకపోయావ్ నితిన్.. దిల్ రాజు సంచలన కామెంట్స్

Follow

Nithin | నితిన్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తమ్ముడు’ సినిమా జులై 4న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రమోషన్ల వేగం పెంచింది చిత్రబృందం. దిల్ రాజు కూడా చురుకుగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో హీరో నితిన్, నిర్మాత దిల్ రాజు కలిసి పాల్గొన్న ఓ చిట్ చాట్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఇంటర్వ్యూలో నితిన్ ఓ ప్రశ్నతో దిల్ రాజును ఆశ్చర్యపరిచాడు.“దిల్ సినిమా నుంచి తమ్ముడు వరకు నాలో ప్లస్‌లు, మైనస్‌లు ఏమిటి?” అని అడిగారు.
దీనికి స్పందించిన దిల్ రాజు ..నువ్వు 2002లోనే హీరోవయ్యావ్, నేను మాత్రం 2003లోనే నిర్మాతగా మారాను. అంటే నువ్వే నా కంటే ఒక ఏడాది సీనియర్ అని అన్నారు.ఇప్పుడు నితిన్‌కి ఏ సినిమానైనా హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ , మేనేజ్ చేసే రేంజ్ వచ్చిందని దిల్ రాజు స్పష్టం చేశారు. నీ కన్నా ఒక సంవత్సరం ఆలస్యంగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తాను నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ లోకి వెళ్లాను. నితిన్ ను కూడా తాను అలానే ఊహించానని కానీ అది నితిన్ అఛీవ్ చేయలేకపోయాడని అన్నారు దిల్ రాజు. ఆర్య సినిమా చేస్తున్నప్పుడు అల్లు అర్జున్‌ను, దిల్ సినిమా చేస్తున్నప్పుడు నితిన్ ను తాను ఫ్యూచర్ స్టార్లు గా భావించినట్టు దిల్ రాజు పేర్కొన్నాడు.
బన్నీ తన అంచనాలన్నీ మించి నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లిపోయాడని, కానీ నితిన్ మాత్రం ఆ స్థాయికి చేరుకోలేకపోయాడంటూ దిల్ రాజు స్పష్టం చేశారు. ఇప్పుడు నువ్వు చేస్తున్న తమ్ముడు సక్సెస్ అవుతుంది.. కానీ అది సరిపోదు. తమ్ముడు సినిమా నిన్ను మళ్లీ సక్సెస్‌ఫుల్ హీరోగా నిలబెడుతుంది కానీ అది చాలదు. టాప్ రేంజ్‌కి రావాలంటే ‘ఎల్లమ్మ’తో గట్టిగా కొట్టాలి అని స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దిల్ రాజుతో తనకు సత్సంబంధాలు లేనప్పుడు కూడా ‘రామ్’ అనే సినిమా విషయంలో ఫైనాన్సియల్ గా హెల్ప్ చేశారని, అందుకే ఆయన్ని బిల్ రాజు అంటానని నితిన్ పేర్కొన్నాడు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతీ సినిమాకి ఆయన సహాయం చేస్తుంటారని, అలాంటి వ్యక్తిపై చిన్న సినిమాని తొక్కేస్తున్నారని ట్రోల్స్ చేస్తుండడం భావ్యం కాదు అని నితిన్ పేర్కొన్నాడు.
Nithin | నితిన్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తమ్ముడు’ సినిమా జులై 4న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రమోషన్ల వేగం పెంచింది చిత్రబృందం. దిల్ రాజు కూడా చురుకుగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో హీరో నితిన్, నిర్మాత దిల్ రాజు కలిసి పాల్గొన్న ఓ చిట్ చాట్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.