Nizamabad: దారుణం.. కన్నతల్లిని గొడ్డలితో నరికి నగలు ఎత్తుకెళ్లిన కొడుకు…

Follow

నిజమాబాద్ జిల్లా బోధన్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. పెంటఖుర్డు గ్రామంలో దారుణం వెలుగుచూసింది. కన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు కసాయిలా మారాడు. కన్నతల్లి పట్ల కాలయముడయ్యాడు. తాగిన మత్తులో తల్లిని గొడ్డలితో నరికాడు చిన్న కొడుకు సురేశ్. తల్లిని హతమార్చిన అనంతరం నగలు ఎత్తుకెళ్లాడు. సుమారు 50 తులాల వెండి ఆభరణాలు అపహరించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు బోధన్ రూరల్ పోలీసులు వెల్లడించారు.
నిజమాబాద్ జిల్లా బోధన్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. పెంటఖుర్డు గ్రామంలో దారుణం వెలుగుచూసింది. కన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకు కసాయిలా మారాడు. కన్నతల్లి పట్ల కాలయముడయ్యాడు. తాగిన మత్తులో తల్లిని గొడ్డలితో నరికాడు చిన్న కొడుకు సురేశ్. తల్లిని హతమార్చిన అనంతరం నగలు ఎత్తుకెళ్లాడు. సుమారు 50 తులాల వెండి ఆభరణాలు అపహరించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు