No Fuel | నేటి నుంచి ఆ వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ బంద్‌.. ఎందుకంటే?

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Nofuel

న్యూఢిల్లీ: జీవితకాలం ముగిసిన (EOL) వాహనాలకు ఆయిల్‌ పంపుల వద్ద ఇంధనాన్ని (No Fuel) నిషేధిస్తూ ఢీల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది. వాహన కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం నిపడాన్ని అనుమతించేది లేదని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి దానిని అమలు చేస్తున్నది. దీనికోసం దేశ రాజధానిలోని 500 పెట్రోల్‌ బంకుల్లో ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరా సిస్టమ్‌లను ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (DTIDC) ఏర్పాటు చేసింది. అదేవిధంగా 100 ప్రత్యేక బృందాలను ఢిల్లీ రవాణా శాఖ నియమించింది. ఈ ఏడాది నవంబర్‌ 1 నుంచి గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, సోనిపట్‌లకు ఈ నిషేధాన్ని విస్తరించనున్నారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి నేషనల్ క్యాపిటల్ రీజియన్(NCR)లోని మిగిలిన ప్రాంతాల్లో అమలుచేస్తారు.

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో జీవితకాలం ముగిసిన వాహనాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. నివేదికల ప్రకారం, ఢిల్లీలో జీవితకాలం ముగిసిన బైకుల సంఖ్య 62 లక్షలు ఉండగా, నాలుగు చక్రాల వాహనాలు 41 లక్షలు ఉన్నాయి. ఎన్‌సీఆర్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. హర్యానాలో సుమారు 27.5 లక్షల వాహనాలు, ఉత్తరప్రదేశ్‌లో 12.4 లక్షలు, రాజస్థాన్‌లో 6.1 లక్షల వాహనాలు జీవితకాలం ముగిసిపోయాయి. 2018లో, సుప్రీంకోర్టు ఢిల్లీలో 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలను, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలను నిషేధించింది.

​జీవితకాలం ముగిసిన (EOL) వాహనాలకు ఆయిల్‌ పంపుల వద్ద ఇంధనాన్ని (No Fuel) నిషేధిస్తూ ఢీల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది. వాహన కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం నిపడాన్ని అనుమతించేది లేదని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *