NPDCL | ఖాళీ స్థలంలో కొత్త సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి.. ఎన్‌పీడీసీఎల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌కు వినతిపత్రం

Follow
( 0 Followers )
X

Follow

E-mail : *
Spdcl

NPDCL |  కరీంనగర్ రూరల్, జూలై 01 : బొమ్మకల్ సబ్ స్టేషన్ నుండి మా గ్రామం అయిన దుర్శేడ్ డివిజన్ (ఇటీవల కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం అయినది) గుంటూరుపల్లి, గోపాల్ పూర్ నల్లగుంటపల్లి, బొమ్మకల్ గ్రామాలకు విద్యుత్ సరఫరా అవుతుందని.. ఈ ఐదు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు ఏ ఒక్క గ్రామంలో ఉదయం, రాత్రి వేళలో అంతరాయం కలిగినా.. గంటల తరబడి మిగతా గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం జరుగుతుండటంతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దుర్శేడ్‌లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మంగళవారం ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌కు మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు కలిసి వినతిపత్రం అందజేశారు.

గతంలో దుర్శేడ్ గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ కోసం సుమారు 40 ఎకరాలు కోట్లాది రూపాయల విలువైన హైవే రోడ్డు పక్కన భూములను రైతులు అందించారని, ఇందులో 220 కేవీ, 132/11 కేవీ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, దుర్శేడ్‌లో ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ నుండి మిగతా జిల్లాలకు విద్యుత్ సరఫరా అవుతున్నది.. కానీ మా గ్రామానికి వేరే చోట నుండి విద్యుత్ సరఫరా చేస్తున్నారని తెలిపారు.

బొమ్మకల్ గ్రామం నుంచి దుర్శేడ్ వచ్చే విద్యుత్ సరఫరా గుంటూరుపల్లి స్టేజీ వద్ద రైల్వే ట్రాక్ లోపలి నుంచి విద్యుత్ కేబుల్ ఏర్పాటు చేయడంతో ఇక్కడ ఏ చిన్న అంతరాయం కలిగినా రైల్వే అధికారుల అనుమతి తీసుకొని వచ్చే వరకు దుర్శేడ్, గోపాల్ పూర్, నల్లగుంటపల్లి గ్రామాలకు విద్యుత్ సరాఫరాలో అంతరాయం కలుగుతుందని వివరించారు. అలాగే రైతుల వ్యవసాయ పొలాలకు మొగ్దుంపూర్ సబ్ స్టేషన్ నుంచి వచ్చే విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుండంతో రాత్రి వేళలో రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

రైతులకు కూడా తీవ్ర ఇబ్బందులు.. 

దుర్శేడ్ లో ఉన్న 220కేవి సబ్ స్టేషన్ నుంచి దుర్శేడ్, గోపాల్ పూర్, నల్లగుంటపల్లి గ్రామాలకు కరెంట్‌ సరఫరా అవుతుందని.. దుర్శేడ్ లోని 220 కేవి సబ్ స్టేషన్ పక్కన ఖాళీ స్థలంలో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తే, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలిపారు. అలాగే ప్రస్తుతం దుర్శేడ్, గోపాల్ పూర్ గ్రామాలు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం అయినందున విద్యుత్ సరఫరాలో మరిన్ని ఇబ్బందులు రానున్నాయని వివరించారు.

దుర్శేడ్ 220 కేవీ సబ్ స్టేషన్ ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి ఆయా గ్రామాల రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని కోరారు. అలాగే గత రెండు సంవత్సరాల క్రితం లైన్‌మెన్‌ సస్పెండ్ కాగా.. ఇప్పటి వరకు లైన్‌మెన్ నియమించబడలేదని, దీంతో వినియోగదారులు, రైతులు ఇబ్బందులకు గురవుతున్నందున నూతన లైన్‌మెన్ నియమించాలని సంపత్ రావు కోరారు.

Read Also : 

Couple died | రెండు నెలల క్రితం ప్రేమ వివాహం.. సిగాచీ ఫార్మా ప్రమాదంలో దంపతులు దుర్మరణం

Chahat Bachpai | డ్రైనేజీని పరిశీలించిన మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాచ్‌పాయ్‌

NTR Vs Hrithik Roshan | వార్ 2 సెట్స్‌లో డ్యాన్స్‌తో దుమ్ము లేప‌బోతున్న‌ స్టార్ హీరోలు!

 

​NPDCL | గంటల తరబడి మిగతా గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం జరుగుతుండటంతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దుర్శేడ్‌లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మంగళవారం ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంటింగ్ ఇంజనీర్‌కు మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు కలిసి వినతిపత్రం అందజేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *