Off The Record: వైఎస్ జగన్ పర్యటనలపై వైసీపీ నేతలు కంగారు పడుతున్నారా? ఎందుకా కంగారు..?

Follow

Off The Record: వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటనలు సక్సెస్ అవుతున్నా.. ఆ పార్టీ నాయకులు సంతృప్తిగా లేరా? అంతు మించి టెన్షన్ పడుతున్నారా? కొందరైతే భయపడుతున్నారన్నది నిజమేనా? మా నాయకుడు ఎక్కడికెళ్ళినా… జనం పోటెత్తడం ఆనందంగానే ఉందిగానీ..అంటూ సాగదీయడం వెనకున్న సంగతేంటి? అసలు వైసీపీ నేతల కంగారుకు కారణాలేంటి?
Read Also: Off The Record: ఏపీ బీజేపీ నేతలు మేధావులమంటూ ఢిల్లీ నేతల కళ్ళకు గంతలు కడుతున్నారా?
ఓటమి నుంచి కోలుకుని ఫుల్లీ రీఛార్జ్ మోడ్‌లోకి వచ్చేసిన వైసీపీ అధ్యక్షుడు జగన్…. వరుస పర్యటనలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినందున ఇక హనీమూన్ పిరియడ్ ముగిసిందని, ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడుగా వెళ్ళాలని భావిస్తున్నారట ఆయన. ఈ క్రమంలోనే ఆయన జరిపిన పర్యటనల చుట్టూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. తాజాగా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటించారు జగన్. మొత్తం 79 కిలోమీటర్ల ప్రయాణానికి ఏడున్నర గంటల సమయం పట్టింది. దీంతో… ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదంటూ హ్యాపీగా ఉన్నారట వైసీపీ ముఖ్యులు. కానీ… అదే సమయంలో కేడర్, ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు మాత్రం భయపడుతున్నట్టు తెలుస్తోంది. పర్యటనకు కేవలం జగన్ కాన్వాయ్, మరో మూడు వాహనాలు.. వంద మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు పోలీసులు. రెంటపాళ్ల చుట్టూ 14 చెక్ పోస్టులు పెట్టి ఆధార్ కార్డులు చూసి మరీ ఆ గ్రామానికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అయితే జగన్ వచ్చే సమయానికి రద్దీ పెరిగిపోయి నియంత్రించడం పోలీసుల వల్ల కూడా అవని పరిస్థితి. మాజీమంత్రి అంబటి రాంబాబులాంటి నాయకులు స్వయంగా రంగంలోకి దిగి బారికేడ్స్‌ను తొలగించి తమ వాహనాలను నేరుగా పోనిచ్చేశారు.
Read Also: Karishma Kapoor : సంజయ్ కపూర్ అంత్యక్రియల్లో ఏడ్చేసిన కరిష్మాకపూర్..
అయితే, సరిగ్గా ఇక్కడే వైసీపీ శ్రేణులకు టెన్షన్ స్టార్ట్ అయినట్టు చెప్పుకుంటున్నారు. జగన్ రెంటపాళ్ల పర్యటనకు వంద మందికి మాత్రమే అనుమతి ఇస్తే… వేల సంఖ్యలో ర్యాలీగా రావటంపై దృష్టి సారించారట పోలీసులు. పర్యటకు వచ్చిన ప్రతి వాహనాన్ని.. ప్రతీ ఒక్కరినీ కెమెరాలు.. డ్రోన్ల సాయంతో సాధ్యమైనంత ఎక్కువగానే రికార్డు చేసి పెట్టుకున్నారట. దీంతో పాటు ప్రతి ఉల్లంఘనను పరిగణనలోకి తీసుకుని నోట్ దిస్ పాయింట్ అన్నట్లుగా పోలీసులు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ఉల్లంఘనలపై కేసులు బుక్ చేస్తామని ఇప్పటికే క్లారిటీగా చెప్పేశారు పల్నాడు ఎస్పీ. దీంతో… ఇప్పుడు ఎవరెవరి మీద కొత్త కేసులు నమోదవుతాయోనన్న టెన్షన్ మొదలైందట వైసీపీ శ్రేణుల్లో. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగం మీద ఇప్పటికే అంబటి రాంబాబు మీద కేసు నమోదైంది. ఇక మెల్లిగా పోలీసులు వీడియోలన్నిటినీ పరిశీలించి కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ పాయింట్ చుట్టూనే ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోందట. పెద్ద నాయకులంటే… వాళ్ళకు రకరకాల వనరులు, వెసులుబాట్లు ఉంటాయి. కేసులు పెట్టించుకున్నా.. పెద్దగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కానీ, మేం బుక్కయితే తర్వాత పట్టించుకునేదెవరు? పోలీస్ స్టేషన్స్, కోర్టుల చుట్టూ తిరగాల్సిందేనా అంటూ కేడర్ మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది.
Read Also: PM Modi: రెండ్రోజుల్లో మూడు రాష్ట్రాల పర్యటన.. ఏపీకి సైతం మోడీ రాక..
ఇక, ఈ టూర్‌కంటే ముందు జగన్… ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతుల పరామర్శ కోసం వెళ్ళారు. అప్పుడు ఆ పర్యటనను వ్యతిరేకిస్తూ టీడీపీ నిరసనలు.. పరస్పరం రాళ్లు రువ్వుకోవటాలు, పలువురికి గాయాలవడం లాంటివి జరిగాయి. కట్ చేస్తే…. ఆ ఎపిసోడ్‌లో 25 మంది వైసీపీ కార్యకర్తల మీద కేసులు బుక్ అయ్యాయి. అంతకు ముందు జగన్ తెనాలి పర్యటన సమయంలోనూ ఇదే సీన్ కనిపించింది. పోలీసుల చేతిలో పబ్లిక్‌గా లాఠీ దెబ్బలు తిన్న యువకుల కుటుంబాల పరామర్శకు వెళ్ళినప్పుడు కూడా ఆయన రాకను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాల ఆందోళన నడిచింది. నేర చరిత్ర ఉన్నవాళ్ళని పోలీసులు కొడితే పరామర్శకు వస్తారా అంటూ జగన్ టూర్‌ను నిరసించడంతో అప్పుడు కూడా గొడవ అయింది. దానికంటే ముందు జగన్ రాప్తాడు పర్యటన కూడా వివాదాస్పదమైంది. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు జగన్.
కాగా, పరామర్శ పూర్తి చేసుకొని తిరిగి హెలిపాడ్‌కు వెళ్లే సమయంలో పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ కార్యకర్తలు హెలికాప్టర్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ హెలికాప్టర్ అద్దాలు స్వల్పంగా దెబ్బ తిన్న వ్యవహారానికి సంబంధించిన వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. పైలట్ల విచారణ ప్రక్రియ నడుస్తూనే ఉంది. ఈ ఎపిసోడ్‌లో కూడా నేతలు.. కార్యకర్తలపై పోలీస్ కేసులు పడ్డాయి. ఇలా… మొత్తంగా చూసుకుంటే…. జగన్ ఎక్కడ పర్యటనకు వెళ్ళినా… రచ్చ జరగడం, కేసులు కామన్ అన్నట్టుగా మారిపోతోంది వ్యవహారం. ఇప్పుడు ఈ పరంపరే కార్యకర్తలు, కింది స్థాయి నాయకుల్ని భయపెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. వరుస కేసుల్లో ఇరుక్కుంటే రేపటి రోజు ఎలా ఉంటుందోనన్న ఆందోళన పెరుగుతోందట కొందరిలో.తాజా సత్తెనపల్లి ఎపిసోడ్‌లో ఎన్ని కేసులు బుక్ అవుతాయో… దానికి జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
ఓటమి నుంచి కోలుకుని ఫుల్లీ రీఛార్జ్ మోడ్‌లోకి వచ్చేసిన వైసీపీ అధ్యక్షుడు జగన్…. వరుస పర్యటనలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినందున ఇక హనీమూన్ పిరియడ్ ముగిసిందని, ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడుగా వెళ్ళాలని భావిస్తున్నారట ఆయన.